మీ పేరుతో 30 మంది బ‌లి


క‌డ‌ప‌ ) చంద్ర‌బాబు నాయుడు పేరు చెప్పి 30 మంది అమాయ‌కులు బ‌లి అయ్యార‌ని పార్టీ ఎమ్మెల్యే శ్రీ‌కాంత్ రెడ్డి ఆరోపించారు. క‌డ‌ప లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేస్తోందని, కేవ‌లం ఆర్భాటాల‌కే పెద్ద పీట వేస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర రైతులు స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతుంటే వేల కోట్ల రూపాయిలు వెచ్చించి, పుష్క‌రాల పేరుతో సినిమా తీస్తారా అని ఆయ‌న  ప్ర‌శ్నించారు. ఆర్భాటాల‌కు పోకుండా ప్ర‌జా సమ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని ఆయ‌న సూచించారు.
Back to Top