పేదలను కొట్టి ధనవంతులకు పెడుతున్నారు..!

హైదరాబాద్ః ప్రియతమ నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్ ప్రజలకు మేలు చేసేవిగా ఉండేవని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి పేదల కోసం పరితపించారని తెలిపారు. కానీ చంద్రబాబు ఎప్పుడూ ఉన్నతవర్గాల గురించే  ఆలోచిస్తారని విమర్శించారు. పేదలను కొట్టి  ధనంవతులకు పంచిపెడతున్నారని అన్నారు. 

విద్యార్థులకు నష్టం చేకూరేలా చంద్రబాబు 120 జీవో తీసుకురావడం దురదృష్టకరమన్నారు. గతంలో ఉన్న జోనల్ వ్యవస్థనే కొనసాగించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాయలసీమలోనే పుట్టి ఆప్రాంతానికే అన్యాయం చేస్తున్నాడని శ్రీకాంత్ రెడ్డి  ధ్వజమెత్తారు. వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు నష్టం చేకూరేలా చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. 
Back to Top