కుట్రపూరితంగా బద్నాం చేస్తున్నారు

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలనలో అన్ని రకాలుగా విఫలమైన అధికార పార్టీ
...అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు.
తెలుగుదేశం నేతలు వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆనెపాన్ని
వైఎస్సార్సీపీపై వేసి బద్నాం చేయాలని కుట్ర పన్నుతున్నారని శ్రీకాంత్
రెడ్డి ఫైరయ్యారు.  వాస్తవాలు ప్రజలకు తెలియజేప్పేందుకే తాము ఈప్రెస్ మీట్
పెట్టినట్లు చెప్పారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఆగడాలను వీడియోద్వారా
ప్రదర్శించి చూపించారు. శ్రీకాంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే....

ప్రజల ఇబ్బందులపై తాము చర్చకు పట్టుబడితే టాపిక్ డైవర్ట్ చేసేందుకు తమపై ఎదురుదాడికి దిగారు.  
రోజా విషయంలో  లేనివి ఉన్నట్లు చూపుతూ ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాకు లీక్ చేశారు. 
వాస్తవాలు తెలుసుకోవాలని  ప్రొసీడింగ్ కాపీలు అడిగాం. 
స్పీకర్ కోడెల శివప్రసాద్, కాల్వ శ్రీనివాసులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
ఎడిటింగ్ వీడియోస్ ను స్పీకర్ ఇచ్చారని కాల్వ శ్రీనివాసులు చెప్పారు.
మాకు ఇవ్వాలని స్పీకర్ ను అడిగితే..నేనివ్వలేదు, నాకు తెలియదు, సెల్ ఫోన్ లో చిత్రీకరించారని స్పీకర్ ఏవేవో మాట్లాడారు
లీకుడ్  వీడియోలతో వైఎస్సార్సీపీని కుట్రపూరితంగా బద్నాం చేయాలని చూశారు.
గతంలో జరిగిన వీడియోలు తీసుకొచ్చి తప్పుదోవ పట్టించారు. 
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాల వేసి స్వామి  డ్రెస్ లో ఉన్నారు. మామూలు డ్రెస్ లో ఉన్న వీడియోస్ చూపించారు. 
ఇద్దరికీ వేర్వేరు వీడియోలు ఇచ్చి మీడియా, ప్రజల్లో వైఎస్సార్సీపీపై దుష్ర్పచారం చేయించారు. 
రాష్ట్రంలోని సమస్యలపై చర్చించాలని ఆశతో తాము అసెంబ్లీకి వెళితే అడ్డుకోవడమే గాకుండా దుష్ర్పచారం చేయడం దుర్మార్గం.
వైఎస్ జగన్ అబద్ధాల పుట్ట, ఆయన  అన్నందుకే..స్పీకర్ , యనమల ఆపదాలు వాడవద్దన్నారు. దీంతో వాటిపై జననేత వివరణ ఇచ్చారు
చంద్రబాబు, బోండా ఉమ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అనిత, రావెల కిశోర్ లు మరికొంతమంది ఇష్టమొచ్చినట్లు తిట్టారు.
రౌడీ ఎమ్మెల్యేలు, 420, మీ అంతు చూస్తాం, పాతేస్తాం, ఏంట్రా, ఆంటీ అంటూ టీడీపీ నేతలు బూతులు తిట్టినా స్పీకర్ కనీసం వారించలేదు.
గతంలో అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు తప్పులుంటే క్షమించమని స్పీకర్ కోరడంతో ఉపసంహరించుకున్నాం.
తీరు మారుతుందని ఆశించాం. కానీ మారలేదు.
ప్రజాసమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చాం. 
హౌస్ ఆర్డర్ లో లేకపోయినా వాళ్లతో మాట్లాడించి స్పీకర్ తిట్టిస్తున్నారు. 
ఆధారాలు ఇవ్వమంటే ఇవ్వరు. పొరపాటు జరిగిందంటారు. రికార్డ్స్ నుంచి తీసేయమంటే తీసేయరు.
రూల్ ప్రకారం మైక్ ఇవ్వండంటే ఇవ్వరు. మైక్ దక్కించుకోవడం కోసం పోడియంలోకి వస్తుంటే నిందలు వేస్తున్నారు
ప్రజల అంశాలు మాట్లాడేందుకు, వాళ్లకు తెలియజెప్పేందుకే మైక్ కోసం పోరాడేందుకు పోడియంలోకి వచ్చాం.
ప్రతిపక్షంతో సమన్వయం కొనసాగించాల్సిన స్పీకర్ సభలో ఏకపక్షంగా వ్యవహరించారు.
వాస్తవాలు బయటకు రావాలంటే హౌస్ జరిగేటప్పుడు మీడియాకు స్వేచ్చ కలిపించాలి. 
అప్పుడు ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో ప్రజలు తెలుసుకుంటారు.
చర్చను తప్పించుకోవడానికి రకరకాల కథలు అల్లుతూ ఏవేరోం మాట్లాడుతున్నారో అర్థం కాని రీతిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. 
వైఎస్సార్సీపీ ఆశయాలు తుడిచేయాలి, కారెక్టర్ దెబ్బతీయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడుకోవాలి.
ప్రతిపక్ష
పార్టీగా తమకు బాధ్యత ఉంది. రాజధాని, నిరుద్యోగులు, రైతులు, కాల్
మనీసెక్స్ రాకెట్ సహా అనేక అంశాలు చర్చించాలని ప్లాన్ చేశాం.
ఇవన్నీ మాట్లాడితే మచ్చపడుతుందని లేని పోని కుట్రలు చేశారు. తప్పుదోవ పట్టించే విధానం మానుకోవాలి.  
హైకోర్టు ఇసుక మాఫియాను అడ్డుకోవాలని తీర్పునివ్వడం వైఎస్సార్సీపీ స్వాగతిస్తోంది.
స్వయంగా హైకోర్టు ఇసుకమాఫియా అందంటే అర్థం చేసుకోవాలి. 
ఇసుకతో వందలకోట్లు సంపాదించిన వాళ్లు ఇప్పటికైనా మాఫియాను మానాలి.  దానిని అరికట్టేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
Back to Top