రాయలసీమ పేరుతో దోచుకుంటున్నారు.!

వైఎస్సార్ జిల్లాః చంద్రబాబు, వెంకయ్యనాయుడు కేవలం ఓ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తూ...రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాయలసీమకు నీళ్లిస్తామని చెప్పి పట్టిసీమ పేరుతో ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారని ఆరోపించారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ పేరు చెప్పుకొని అన్నీ రాజధాని ప్రాంతానికి తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో, ఉద్యోగాల నిష్పత్తిలో అన్నింటీలోనూ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి వాపోయారు. 

వెనుకబడిన ప్రాంతాలకు లబ్దిచేకూర్చే ఉద్దేశ్యంతో వైఎస్ జగన్ హోదా కోసం పోరాడుతుంటే  టీడీపీ నాయకులు అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రజల గొంతుకోస్తే క్షమించేదిలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోలార్ ప్రాజెక్ట్ అని చెప్పి 17 వేల ఎకరాలు తీసుకున్నారు. అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. గతంలో పోరాటం చేసిన వాళ్లంతా కళ్లు తెరవాలని, రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి సిద్ధం కావాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Back to Top