చంద్రబాబు అరెస్టుకు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్

హైదరాబాద్ 17 సెప్టెంర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి శ్రీ వైయస్ జగన్మోహన రెడ్డి  కేసులో దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  వ్యవహరిస్తున్నారని రాయచోటి  ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా క్షేత్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యంలేకే చంద్రబాబు కుట్ర  రాజకీయాలకు  పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడడం చంద్రబాబు ఎప్పుడో మరిచిపోయారన్నారు. ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజల దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు, టీడీపీ కలిసి శ్రీ జగన్మోహన్ రెడ్డిపై దాదాపు 26 నెలల క్రితం కేసు వేశారని చెప్పారు. కోర్టు నాలుగు వారాలు గడువిచ్చినప్పటికీ సీబీఐ ఆగమేఘాలపై రెండు వారాలలో ప్రాథమిక విచారణను పూర్తిచేసిందన్నారు. అనంతరం, చార్జి షీట్లు వేస్తుండడం రాజకీయ కోణం కాదా అని ప్రశ్నించారు. విచారణ త్వరగా పూర్తిచేస్తామని చెప్పి సమయం కోరడం కోర్టు గడువు ఇవ్వడం కూడా తెలిసిందేదనన్నారు. చార్జిషీట్లు వేస్తున్న దశలో అసలైన విలన్ రూపంలో చంద్రబాబు రంగంలోకి వచ్చారన్నారు. ఎంపీలను ఈడీ దగ్గరకు పంపి, బెయిలును అడ్డుకునే యత్నం చేస్తున్నారన్నారు. కేసుల్ని ప్రభావితం చేస్తున్నామని తమపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఈడీ, సీబీఐల వద్దకు వెళ్ళడం ప్రభావితం చేయడం కాదా అని ప్రశ్నించారు. దీన్ని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతసేపూ లాబీ, కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు త్వరలో జరగనున్న ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెబుతారని శ్రీకాంత్ రెడ్డి స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top