ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు

రాయచోటి రూరల్‌ : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా రాయచోటి నియోజకవర్గంలో ముస్లింలంతా కలిసికట్టుగా మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. వేలాది మంది ముస్లింలు ఒక చోటకు చేరి ప్రార్థనలు చేసుకోవడం , వారితో కలిసి తాను కూడా ప్రార్థనల్లో పాల్గొనడం ఏటా చాలా సంతోషంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజా ఫోటోలు

Back to Top