ప్రజల అజెండాయే మా అజెండా..!

() 17 అంశాల్ని ప్రతిపాదించిన వైఎస్సార్సీపీ

() 40 రోజులు చర్చ
జరగాలని ప్రతిపాదన

() 16 రోజులకే
కుదించిన ప్రభుత్వం



హైద‌రాబాద్‌:
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం లేవ‌నెత్తిన అన్ని అంశాల‌ను చ‌ర్చించాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి కోరారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా
శ‌నివారం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అనంత‌రం బీఏసీ స‌మావేశం స్పీక‌ర్ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు.
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జ్యోతుల
నెహ్రు, గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి
హాజ‌రై ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు చేశారు. ఈ
సంద‌ర్భంగా శాస‌న‌స‌భ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ... గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై
అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల
గురించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో లేకుండా అన్ని ప్ర‌భుత్వ విజ‌యాలు అన్న‌ట్లుగా, బ్ర‌హ్మండంగా
రాష్ట్రంలో పాల‌న జ‌రుగుతున్న‌ట్లు అధికార పార్టీ గ‌వ‌ర్న‌ర్‌తో పొగిడించుకున్నార‌ని
విమ‌ర్శించారు. చంద్ర‌బాబు రాయించి ఇచ్చిన స్క్రిప్టు ను అర‌గంట పాటు గ‌వ‌ర్న‌ర్‌తో చ‌దివించార‌ని
ఎద్దేవా చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాలు 40 రోజులు జ‌ర‌గాల‌ని బీఏసీ మీటింగ్‌లో కోరామ‌న్నారు.
ఇందుకు ప్ర‌భుత్వం నిరాక‌రించింద‌ని, బ‌డ్జెట్ 30వ తేదీలోగా పాస్ కావాల‌ని శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాలు, ఆర్థిక మంత్రి
య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు పేర్కొన్నారని, బ‌డ్జెట్ పాసైన త‌ర్వాత అనేక అంశాలు
ఉన్నాయి... వాటిపై చ‌ర్చిద్దామ‌ని వైఎస్సార్‌సీపీ సూచించింద‌న్నారు. దీనికి వేరే
కార్య‌క్ర‌మాలు ఉన్నాయ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు
చెప్పారు. కేవ‌లం 16రోజులు మాత్ర‌మే స‌భ జ‌రిగేలా ముందుగానే అధికార పార్టీ నేత‌లు
ప్ర‌ణాళిక రూపొందించుకొని బీఏసీ స‌మావేశానికి వ‌చ్చార‌ని విమ‌ర్శించారు. వైఎస్సార్
సీపీ ప‌లు అంశాల‌ను బీఏసీ స‌మావేశం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు శ్రీ‌కాంత్‌రెడ్డి
పేర్కొన్నారు. సీఆర్‌డీఏ భూస‌మీక‌ర‌ణ - రైతాంగ అసంతృప్తి, అవినీతి, వ్య‌వ‌సాయ
సంక్షోభం, రైతాంగ స‌మ‌స్య‌లు, గిట్టుబాటు ధ‌ర‌లు, ప్రాజెక్ట్
అంచ‌నాల పెంపు... అందులో జ‌రిగిన అవినీతి, అగ్రిగోల్డ్ బాధితులు - ప్ర‌భుత్వం
తీసుకున్న చ‌ర్య‌లు, కృష్ణా న‌దీ జ‌లాలు, రైతాంగం ఇక్క‌ట్లు, తెలంగాణ ప్ర‌భుత్వం
చేప‌ట్టిన ప్రాజెక్టుల వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు, వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి - వాటి స‌మ‌స్య‌లు, డ్వాక్రా రుణ‌మాఫీ
పేరుతో సంఘాల నిర్వీర్యం, రాష్ట్రంలో నెల‌కొన్న తాగునీటి స‌మ‌స్య‌లు, నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల, పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్ర‌భుత్వం
అనుస‌రిస్తున్న నిర్ల‌క్ష్యం, ప‌ట్టిసీమ ప్రాజెక్టు లో చోటు చేసుకున్న అవినీతి, నిరుద్యోగం, నిరుద్యోగ భృతి, ఉపాధి అవ‌కాశాలు, కాంట్రాక్ట్
ఉద్యోగుల తొల‌గింపు, ప్ర‌త్యేక‌హోదా సాధించ‌డంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు
పక్కా గృహాలు, ప‌రిశ్ర‌మ‌ల పేరుతో బ‌ల‌వంత‌పు భూ సేక‌ర‌ణ‌, స్థానిక సంస్థ‌ల
నిర్వ‌హ‌ణ‌, రాజ్యాంగేత‌ర క‌మిటీలు(జ‌న్మ‌భూమి), క‌రువు, రైతుల ఆత్మహ‌త్య‌లు, వ‌ల‌స‌లు, ప్ర‌భుత్వ
ఆస్ప‌త్రుల ప్రైవేటీక‌ర‌ణ‌, రాజ‌ధాని త‌ర‌లింపు ఇలా రాష్ట్రంలో నెల‌కొన్న ముఖ్యమైన ప్రజాస‌మ‌స్య‌ల‌పై బీఏసీ స‌మావేశంలో చ‌ర్చించి ప‌రిష్కార‌మార్గాలు
చూపాల‌ని వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు శ్రీ‌కాంత్‌రెడ్డి
తెలిపారు. ప్ర‌తి స‌మ‌స్య‌పైనా కొంత సమయం అయినా తీసుకొని అన్ని అంశాల‌పై చర్చ జ‌ర‌గాల‌ని
సూచించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చిత్త‌శుద్ధి ఉంటే చ‌ర్చ‌కు సిద్ధం కావాల‌ని
డిమాండ్  చేసిన‌ట్లు వెల్ల‌డించారు. వీట‌న్నింటిపై స‌మాధానం ఇస్తాన‌ని
సీఎం చెప్పార‌ని, అయితే చంద్ర‌బాబు మాట‌పై నిల‌బ‌డిన సంద‌ర్భాలు లేవ‌ని విమ‌ర్శించారు.
టీడీపీ ప్ర‌భుత్వం ఏ ఒక్క మంచిపనీ చేయ‌లేద‌ని, ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తోంద‌ని మండిపడ్డారు. ప్ర‌తిప‌క్షం లేవ‌నెత్తిన అన్ని అంశాల‌కు ప్ర‌భుత్వం
చిత్త‌శుద్ధితో స‌మాధానం చెప్పేందుకు సిద్ధం కావాల‌ని కోరిన‌ట్లు శ్రీ‌కాంత్‌రెడ్డి
వివ‌రించారు.

Back to Top