వైయస్ఆర్‌సీఎల్పీ నేతగా జగన్ ఏకగ్రీవం

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా), 21 మే 2104:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శాసనసభ పక్ష ‌నాయకుడిగా శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలోని మహానేత డాక్టర్ వైయస్ఆర్‌ ఘాట్‌ వద్ద బుధవారం జరిగిన పార్టీ శాసనసభా‌ పక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు శ్రీ జగన్ను ‌తమ నేతగా ఎన్నుకున్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి పేరును పార్టీ శాసనసభా పక్ష నేతగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపాదించారు. పార్టీ శాసన సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు, ‌లోక్‌సభ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు హాజర‌య్యారు.

Back to Top