లక్నో వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరిన జగన్‌

హైదరాబాద్‌ :

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలే‌శ్ యాద‌వ్‌ను కలిసేందుకు లక్నోకు వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమా‌జ్‌వాదీ పార్టీ మద్దతు కూడగట్టాల్సి ఉందని తెలిపారు.‌ కోర్టు అనుమతి లేనిదే హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న తన బెయిల్ షరతును సడలించి అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలయోగి విచారణకు స్వీకరించారు. గతంలో లక్నో వెళ్లేందుకు శ్రీ జగన్‌కు కోర్టు అనుమతి మంజూరు చేసినా ఉపఎన్నికల ప్రచారం‌తో‌ అఖిలేశ్ యాదవ్ తీరిక లేకపోవడంతో ప్రయాణం రద్దయిన విషయం తెలిసిందే.

Back to Top