పలమనేరులో ఓదార్పునకు అనుమతించండి

హైదరాబాద్:

బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లా పలమనేరు వెళ్ళేందుకు తనను అనుమతించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్లుకు విజ్ఞప్తి చేశారు. మహానేత, దివంగత సీఎం డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి, సమైక్య శంఖారావం మలి విడత కార్యక్రమాన్ని పలమనేరులో నిర్వహించడానికి తాను చిత్తూరు జిల్లాకు ఈ నెల 27న వెళ్ళాల్సి ఉందని ఆ విజ్ఞప్తిలో శ్రీ జగన్‌ తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన న్యాయవాది అశోక్‌రెడ్డి సోమవారంనాడు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇంతకు ముందు మధ్యలో నిలిపిన ఓదార్పు యాత్రతో పాటు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సమైక్య శంఖారావాన్ని శ్రీ జగన్‌ చేపట్టనున్నారని తెలిపారు.

శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 26న బెంగళూరులో ఉండి 27న పలమనేరు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నారని పిటిషన్‌లో న్యాయవాది కోర్టుకు వివరించారు. జనవరి 2వ తేదీ వరకూ శ్రీ జగన్‌ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారని పేర్కొన్నారు. పిటిషన్‌ను సీబిఐ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐ అభిప్రాయం చెప్పాలని విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు.

Back to Top