వైయస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్ :

భోగి, మరక సంక్రాంతి పండుగల సందర్భంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పల్లెల్లో ఇంటింటి పండుగైన సంక్రాంతి పాడిపంటల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలతో తులతూగాలని, ప్రత్యేకించి రైతన్నలు, రైతు కూలీలకు మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు.

అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగునేల పాడి, పంటలకు నెలవు కావాలని శ్రీ జగన్‌ అభిలాష వ్యక్తంచేశారు. శాంతి సౌభాగ్యాలతో రాష్ట్రం వర్ధిల్లాలని, పల్లెలు మళ్ళీ కళకళలాడాలని కోరుకున్నారు. రైతన్నకు అండదండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగ చేసే విధానాలు మరోసారి జయం కలగాలని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అభిలషించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top