బాబు అబద్ధాలకు హద్దు లేదు

గుంటూరు:

‘దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి పాలనకు, అంతకు‌ ముందు చంద్రబాబు పాలనకు ఒకే తేడా ఉంది. ఆ తేడా విశ్వసనీయత. చంద్రబాబు నాయుడు అన్నీ ఫ్రీగా ఇస్తానని ఎలాంటి మొహమాటమూ లేకుండా అబద్ధాలు చేప్పేస్తారు. ఎందుకంటే ఎన్నికలైపోయాక ప్రజలతో నాకేంటని అనుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయన వయసు 65. ఆయనకు ఇదే చివరి ఎన్నిక కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘ఆయనకన్నా నేను 25 సంవత్సరాలు చిన్నవాడిని. నేను యువతరానికి ప్రతినిధిని. ఒక మాట ఇస్తే దాని కోసం ఎందాకైనా పోతానని చెబుతున్నా. విశ్వసనీయతకు పెద్ద పీట వేస్తా. నాకూ చంద్రబాబుకు తేడా అది. విశ్వసనీయత అన్నది రాజశేఖరరెడ్డి గారి నుంచి నాకు వారసత్వంగా వచ్చిందని నేను గట్టిగా, గర్వంగా చెబుతున్నా’ అని శ్రీ వైయస్ జగ‌న్ ‌పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గురువారం నిర్వహించిన ‘వైయస్‌ఆర్ జనభేరి’ బహిరంగ సభలో ‌శ్రీ జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు.

‌పేదరికానికి వైయస్ఆర్ వైద్యం‌:

‘రాముని రాజ్యం నేను చూడలేదు గానీ రాజశేఖరుని సువర్ణ యుగాన్ని మనమంతా చూశాం. పేదరికానికి కులం ఉండదు, మతం ఉండదు, పార్టీలు ఉండవు, రాజకీయాలుండవు. అలాంటి పేదరికానికి వైద్యం చేయాలని ఓ డాక్టర్‌గా ముందుకు వచ్చిన వ్యక్తి మహానేత రాజశేఖరరెడ్డి. ఈ రోజు వైయస్ బతికి ఉంటే ఎంతో బాగుండునని అనే మాట రాష్ట్రం మొత్తం మీద వినిపిస్తుంది. ఆ పాలనను సువర్ణ యుగం అంటారు. ఆ పాలనను విశ్వసనీయత పాలనంటారు. నిజాయితీతో కూడిన పాలనంటారు. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఈ రాజకీయ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింద'ని శ్రీ వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

'నేటి రాజకీయాలు చదరంగంలా తయారయ్యాయి. ఒక మనిషిని తప్పించడానికి ఎలా దొంగ కేసులు పెట్టాలి? అని చూస్తున్నారు. ఒక పార్టీ లేకుండా చేయడం కోసం ఆ మనిషిని జైలుకు పంపేందుకు మనస్సాక్షి కూడా అడ్డురావడం లేదు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడానికి వెనుకాడని పరిస్థితికి ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. మొన్న విభజన బిల్లు విషయంలో పార్లమెంటు, అసెంబ్లీలో జరిగిన తీరును మనందరం గమనించాం. పార్లమెంటు తీరుతో రాజకీయ వ్యవస్థ మీదనే అసహ్యం పుడుతుంది. పార్లమెంటు జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు బిల్లు చాలా అన్యాయంగా ఉందని మాట్లాడారు. లోపల అదే బిల్లుకు అనుకూలంగా తన ఎంపీల చేత ఓటు వేయించార'ని శ్రీ వైయస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు.

సువర్ణ యుగాన్ని మళ్ళీ తెచ్చుకుందాం :
'ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపు చూ‌సే వారికి అడ్డగోలు విభజనతో ఇప్పుడు ఆ నగరాన్ని చదువుకున్న పిల్లవాళ్ళకు కాకుండా చేశారు. కొత్త రాజధాని కట్టుకునేందుకు ఎన్ని డబ్బులు ఇస్తారు? ఎక్కడ కట్టుకోవాలనే విషయం కూడా చెప్పకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. ఇంతటి దారుణంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పార్లమెంటులో ప్రతిపక్ష బీజేపీ ఇద్దరూ కూడా ఓ వైపు బిల్లు అన్యాయంగా ఉంది అంటూనే దానికి అనుకూలంగా ఓటేశారు. ఇది న్యాయమా? అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన ఈ పార్టీలు మళ్లీ ప్రజల వద్దకు వచ్చి ఓట్లు, సీట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. ఈ రాజకీయ వ్యవస్థను మనం మార్చేద్దాం. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీని తీసుకొద్దాం. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ యుగాన్ని కలిసికట్టుగా మళ్లీ సాధించుకుందాం' అన్నారు.

'వీళ్ళు చేసిన అన్యాయం, చేస్తున్న అన్యాయం ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నారు. కానీ పై నుంచి  దేవుడు మాత్రం కచ్చితంగా చూస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తాయి. అప్పుడు మనం మన సువర్ణ యుగాన్ని తెచ్చుకుందాం. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం. అదే రాజన్న యుగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా.  ప్రమాణ స్వీకారం రోజు దివంగత నేత రాజశేఖరరెడ్డి గర్వపడేలా నాలుగు సంతకాలు పెడతాను. ఈ నాలుగు సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేస్తాయి. మొట్టమొదటి సంతకం నా అక్కాచెల్లెళ్ల కోసం.. వారి జీవితానికి భరోసా కోసం ‘వైయస్ఆర్ అమ్మ ఒడి’ పథకంపై చేస్తా. ఇక నుంచి మీ పిల్లలను మీరు పనికి కాకుండా బడికి పంపించండి. మీ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తా.‌ ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతా. ప్రతి పిల్లాడికి రూ. 500లు చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ. వెయ్యి నెలానెలా అక్కాచెల్లెమ్మల బ్యాంకు అకౌంట్‌లో మేం వేస్తామని హామీ ఇస్తున్నా'.

'రెండో సంతకం అవ్వాతాతల కోసం పెడతానని గర్వంగా చెబుతున్నా. రెండు నెలలు ఆగండి.. మీ మనవడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇవాళ ఇస్తున్న రూ. 200 పింఛన్‌ను రూ.700కు పెంచుతూ సంతకం పెడతాడు. ఇక మూడవ సంతకం ప్రతి రైతన్న కోసం చేసి.. రూ. 3వేల కోట్లతో స్థిరీకరణ నిధిని తీసుకొస్తా. మద్దతు ధర, గిట్టుబాటు ధర కోసం రైతన్నకు భరోసా ఇస్తా. నాలుగో సంతకం కూడా మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసం పెడతా. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తూ సంతకం చేస్తానని భరోసా ఇస్తున్నా’ అన్నారు.

శ్రీ జగన్ రో‌డ్‌షో, జనభేరి సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి శ్రీ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.‌ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా అయోధ్యరామిరెడ్డి, నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి గోపిరెడ్డిగా శ్రీనివాసరెడ్డిలను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని శ్రీ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Back to Top