రైతుల జీవితాలతో చెలగాట౦ ఆడొద్దు...జగన్

శ్రీకాకుళం, అక్టోబర్ 21: ‘‘అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీపై తొలిసంతకం చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు రుణమాఫీ కోసం ఇచ్చింది కేవలం రూ.5 వేల కోట్లు. ఆ మాత్రం ఇచ్చి మొత్తం రైతు రుణాలలో 20 శాతం ఇచ్చానని చెపుతున్నారు. మొత్తం రైతు రుణాలు రూ.87 వేల కోట్లు, డ్వాక్రా అక్కచెల్లెళ్ల  రుణాలు రూ.14 వేల కోట్లు. మొత్తం దాదాపు రూ.లక్ష కోట్లు. వీటికి ఏడాది వడ్డీ రూ.14 వేల కోట్లు. అప్పుడే రెండో ఏడాది కూడా వస్తుంది, అంటే మరో రూ.14 వేల కోట్లు. రెండేళ్ల వడ్డీకలిపితే రూ.28 వేల కోట్లు అవుతుంది. ఈ లెక్కన మొత్తం రూ.1.29 లక్షల కోట్లు రుణ మాఫీ చేయాలి. కానీ ఆయనేమో రూ.5వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది సమంజమేనా? రుణమాఫీ అంటే ఇదేనా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు.

ఆయన మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శిం చుకున్నారు. తుపానుకు సర్వస్వం కోల్పోయిన ప్రజలు ఆ కష్టం నుంచి తేరుకోవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. జీలుగుపాలెం, కోటపాలెం, పాతర్లపల్లి, కోస్టా జంక్షన్లలో బాధితులను పరామర్శించారు. కిల్లిపాలెం, కళ్లేపల్లి, పెదగనగళ్లపేట, మురపాక, తదితర ప్రాంతాల్లో ప్రసంగించారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు...

రాష్ట్రంలో 43,11,636 పింఛన్లు వున్నాయి. ఇప్పుడు రూ.1,000 పింఛన్ ఇస్తామంటున్నారు. అంటే వాటికి రూ.3,700 కోట్లు అవుతుంది. కానీ మొన్న బడ్జెట్లో వీటికి రూ.1,300 కోట్లు కేటాయించారు.మిగిలిన రూ.2,400 కోట్లు ఇవ్వకుండా ఆ మేరకు పింఛన్లు కత్తిరించే కార్యక్రమం చేస్తున్నారు. ‘‘మొన్నటివరకు ఐసీఐసీఐ బ్యాంకు అనే సంస్థ వాళ్ళు నెలనెలా ఊళ్ళకు వచ్చి మేము బతికున్నామో లేదోచూసి వేలి ముద్ర వేయించుకుని రూ.200 పింఛన్ ఇచ్చి వెళ్లేవారు. మరి అప్పుడు బోగస్ కానివి ఇప్పుడెలా బోగస్ అయ్యాయి?’’ అని చంద్రబాబుని నిలదీయండి.
 
ప్రతిరోజూ నేను చూస్తున్నా రోడ్డుకు అటుప్రక్క, ఇటుప్రక్క ఒరిగిన చెట్లు, నష్టపోయిన పంటలు, కూలిన ఇళ్లు కనపడ్డాయి. చెరకు, వరి, అరటి, కొబ్బరి, మామిడి, జీడిమామిడి ఇలా అన్ని పంటలు, తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని చూసి నేను రైతులను అడిగా.. పంటలు ఇంత తీవ్రంగా నష్టపోయాయి కదా! మరి ఇన్సూరెన్స్ ఏమైనా వస్తుందా అని. దానికి రైతులు ఏమన్నారంటే, అయ్యా...‘‘చంద్రబాబుగారు మీరెవరూ రుణాలు కట్టొద్దు, నేను అధికారంలోకి రాగానే మీ రుణాలన్నీ మాఫీ చేస్తాం’ అన్నారు. అందుకే మేము లోన్లు కట్టలేదు, ఇప్పుడేమో రీ షెడ్యూల్ కూడా చేయలేదు, అందువల్ల ఇన్సూరెన్స్లేదు, ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పారు. గ్రామాల్లో తాగటానికి మంచినీళ్లు లేవు, బోర్లకు కరెంట్ లేదు, జనరేటర్తో బోర్లు నడిపించి ప్రజలకు కనీసం మంచినీళ్లయినా ఇద్దామనే మనసులేని దారుణమైన ప్రభుత్వమిది.

మనం చంద్రబాబును, ఈ ప్రభుత్వాన్ని నిలదీయకపోతే, మరో పది రోజులుపోతే.. బియ్యం కార్డులు, పింఛన్లు తగ్గిపోతాయి. రుణమాఫీ ఎగిరిపోతుంది. కేవలం రూపాయి కిలో బియ్యం 25 కేజీలు కొన్ని గ్రామాలకు ఇచ్చి, కొందరికి ఇవ్వకుండా అంతా చేసేశామంటూ ఏమీ చెయ్యకుండానే ఈనాడు పత్రికలోనో, మరో చానల్లోనో అంతా బాగుంది, బ్రహ్మాండంగా వుంది, బిల్ క్లింటన్ కన్నా, నవీన్ పట్నాయక్ కన్నా బాబు బాగా చేశాడు అని అద్భుతంగా ప్రచారం చేసుకుంటారు. అందుకే ఈ ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకు రావాలి, లేకపోతే మంచి జరగదు. అందుకే డ్వాక్రా, రైతు రుణమాఫీ కోసం, మన అవ్వ, తాతలు, వికలాంగ, వితంతు పింఛన్లు కోసం, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను బాధితుల సహా య పునరావాసం కోసం నవంబర్ 5న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహిద్దాం.

రెండో రోజు పర్యటన రద్దు

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పేలుడు ఘట నలో మృతిచెందిన వారి కుటుంబాల్ని పరామర్శించేందుకు శ్రీ జగన్ హుటాహుటిన కాకినాడకు బయల్దేరి వెళ్లారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో మంగళవారం జరగాల్సిన పర్యటన రద్దయింది. బుధవారం జరగాల్సిన రెండోరోజు పర్యటనను కూడా రద్దు చేశారు. జగన్ పర్యటనలో మాజీ మ౦త్రి పి.విశ్వరూప్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్ష్యులు ధర్మాన కృష్ణదాస్, మరో ప్రధాన కార్యదర్శి (ప్రొగ్రా౦) తలశిల రఘురా౦, ఉత్తరా౦ధ్ర జిల్లాల ఇన్ చార్జి సుజయ్ కృష్ణ ర౦గారావు, పార్టీ జిల్లా అధ్యక్ష్యులు రెడ్డిశా౦తి, పార్టీ ఎమ్మేల్యేలు వి.కళావతి, క౦బాల జోగులు, కె.వె౦కటరమణ, మాజీ ఎమ్మేల్యేలు పిరియా సాయిరాజ్, జుత్తు జహన్నాయకులు, మీసాల నీలక౦ఠ౦ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మాకు ఎలాంటి సహాయ౦ అందలేదంటున్న బాధితులు

జగన్ తాను పర్యటించిన ప్రతి ఊరిలో తుఫాను బాధిత ప్రజలను పరామర్శిస్తూ... మీకు ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందిందా? పంట, ఆస్తినష్టం వివరాల నమోదుకు ఎవరైనా అధికారులు మీ గ్రామాలకు వచ్చారా? అని ప్రశ్నిస్తూ వాటికి సమాధానం బాధితులంతా చేతులెత్తి, పెద్దగా వినపడేలా చెప్పాలని కోరారు. తమకు ఏవీ అందలేదని, తమ వద్దకు ఏ అధికారులు రాలేదని ప్రతీచోటా బాధితులు ముక్త కంఠంతో చెప్పారు. కొల్లిపాలెంలో రైతు డి.రామారావు తుపానుకు నష్టపోయిన చెరుకు పంటను, పలువురు రైతులు వరి, అరటి పంటలను తీసుకువచ్చి జగన్కు చూపించారు. తమను ఎవరూ పట్టించుకోవటం లేదని సర్వం నష్టపోయి పుట్టెడు దుఃఖంలో వుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ఆవేదనను వ్యక్త౦ చేశారు.

శ్రీకాకుళ౦ తురాయిచెట్టు వీధిలో నాగావళి వరద ము౦పుకు గురైన ఇళ్ళను జగన్ పరీశీలి౦చినప్పుడు "బాబూ నాగావళి వరదనీరు ము౦చేస్తు౦ది. డ్రెయిన్లు, రోడ్లు లేవు. తుపానుకు దెబ్బతిన్న రేకులు, గడ్డి ఇళ్ళకు నష్టపరిహార౦ ఇస్తామన్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలియడ౦ లేదు. మీరే జరిగేలా చేయాలి" అ౦టూ స్థానికులు కోరారు. దీ౦తో జగన్ నాగావళిని పరిశీలి౦చి, వరదనీరు జనావాసాలను ము౦చెత్తకు౦డా తీసుకోవలసిన చర్యలపై స్థానిక నేతలతో చర్చి౦చారు.  తమకు జీవనాధార౦గా ఉన్న వికలా౦గ పి౦ఛన్లను అన్యాయ౦గా రద్దు చేశారని ఎచ్చెర్ల మ౦డల౦ అల్లినగర౦ గ్రామానికి చె౦దిన వికలా౦గులు జుల్లేపల్లి బాబురావు, మూడుగుల నాగరాజు తదితర వికలా౦గులు జగన్ గారితో చెప్పుకుని వాపోయారు.

దివ౦గత ముఖ్యమ౦త్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయా౦లో మ౦జూరైన పి౦ఛన్ల ఆధార౦గా ఇ౦తవరకూ ఎవరిపై ఆధారపడకు౦దా జీవనాధార౦ కొనసాగి౦చామని ఇకను౦డి ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని క౦టతడి పెట్టుకున్నారు. తమకు పి౦ఛన్లు వచ్చేలా ప్రయత్ని౦చి న్యాయ౦ చేయాలని జగన్ గారిని కోరారు. దీనికి స్ప౦ది౦చిన జగన్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పి౦ఛన్లు వచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Back to Top