నర్సింగరావు మృతి పార్టీకి తీరని లోటు

హైదరాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం సమన్వయకర్త వడ్డేపల్లి నర్సింగరావు మరణంతో పార్టీకి తీవ్ర నష్టం అని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వడ్డేపల్లి ద్వాదశ దినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీ జగన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. నర్సింగరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మనోధైర్యంతో ఉండాలని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వడ్డేపల్లి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలతో కూడా ముచ్చటించారు.

Back to Top