తెలంగాణ ప్రజలకు జగన్‌ అభినందన

హైదరాబాద్, 2 జూన్ 2014:

కొత్త రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా తెలంగాణలో ప్రతి ఒక్కరికీ పేరుపేరునావైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి శుభాభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని భౌతికంగా విడదీసినా... తెలుగువారు మాత్రం కలిసే ఉంటారని, పరస్పరం సహాయా సహకారాలు అందించుకుంటారని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేశామని, అయినప్పటికీ చివరికి విడిపోయిందని అన్నారు. తెలుగు ప్రజలను విడదీయలేరని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తోడునీడగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌కు ఈ సందర్భంగా శ్రీ జగన్ ‌హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. కేసీఆర్ చేసే ప్రతి మంచి పని‌కీ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.‌

హైదరాబాద్‌లోని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర‌ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో శ్రీ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.

‌ఈ సందర్భంగా శ్రీ జగన్‌ మాట్లాడుతూ.. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి‌ ఎంతగానో కృషిచేశారని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల కారణంగా తెలంగాణ ప్రజల గుండెల్లో వైయస్ఆర్ చిరస్థాయిగా కొలువై ఉన్నారని ‌ఆయన అన్నారు. మహానేత వైయస్ఆర్‌ సీఎం అయిన మరుక్షణమే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా పథకం ఫైలుపై చేసిన తొలి సంతకంతో తెలంగాణలోని మెట్ట ప్రాంత రైతులే అత్యధికంగా లబ్ధి పొందిన విషయాన్ని శ్రీ జగన్‌ ప్రస్తావించారు. మహానేత వైయస్‌ నిర్ణయం వల్ల ఒక్క తెలంగాణలోనే 15 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా పొందినట్లు చెప్పారు.

తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం మహానేత వైయస్ఆర్‌ రూపొందించిన సాగునీటి ప్రాజెక్టులను ఈ రాష్ట్ర రైతులు చిరకాలం గుర్తుంచుకుంటారని శ్రీ జగన్‌ అన్నారు. దీనితో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్‌, ఇతర సంక్షేమ పథకాలు వల్ల తెలంగాణ ప్రజలు ఎంతగానో లబ్ధిపొందారన్నారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ని జాతీయ పార్టీగా చేసేందుకు పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో కృషి చేయాలని శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు.

‌పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలి :
పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకులకు సూచించారు. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన తెలంగాణ అడ్‌హక్ కమిటీతో ‌ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దివంగత మహానేత వైయస్‌ఆర్ రెండు ప్రాంతాల ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు.‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Back to Top