ధర్మవరపు మృతికి వైయస్‌ జగన్‌ సంతాపం

హైదరాబాద్, 8 డిసెంబర్ 2013:

సుప్రసిద్ధ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం పట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. హాస్యానికి చిరునామాగా ధర్మవరపు తన జీవితాన్ని గడిపారని శ్రీ జగన్‌ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాస్యంతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేసుకున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుటుంబానికి శ్రీ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top