గోపీనాథ్‌ ముండే మృతికి జగన్ సంతాపం

హైదరాబాద్‌, 3 జూన్ 2014:

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే ఢిల్లీలో ఈ ఉదయం జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మరణించడం పట్ల వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ప్రజాభిమానం చూరగొని జాతీయ స్థాయి నేతగా ఎదిగిన ముండే అకాలమరణం చెందడం మహారాష్ట్రకే కాక యావద్దేశానికి తీరని లోటు అని ఆయన అభివర్ణించారు. గోపీనాథ్ ముండే కుటుంబానికి ‌శ్రీ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.‌ ముండే ఆత్మకు శాంత చేకూరాలని దేవుడ్ని ప్రార్థించారు.

Back to Top