జైలులో రెండవ రోజునా జగన్‌ నిరశన దీక్ష

హైదరాబాద్, 26 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో రెండవ రోజు సోమవారంనాడు కూడా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం దీక్ష ప్రారంభించిన ఆయన రోజంతా ఎలాంటి ఆహారమూ తీసుకోలేదు. సోమవారం ఉదయం కూడా అల్పాహారం తీసుకునేందుకు శ్రీ జగన్‌ నిరాకరించారు. అన్నపానీయాలు ముట్టకోకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.

ఈ పరిస్థితుల్లో జైలు అధికారులు సోమవారం ఉదయం పది గంటలకు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కలిసి దీక్ష విరమించాలని ఆయనను కోరే అవకాశం ఉంది. జైలు వైద్యులు శ్రీ జగన్‌కు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు సీమాంధ్ర జిల్లాలలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎక్కడిక్కడ రో‌డ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేస్తున్నారు.‌ నిరంకుశంగా, ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ తీరును వారు తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు.

తాజా ఫోటోలు

Back to Top