మూడవ రోజుకు చేరిన జగన్‌ 'సమైక్య దీక్ష'

హైదరాబాద్, 7 అక్టోబర్ 2013:

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశ విధానానికి నిరసనగా, సమైక్యాంధ్రనే కొనసాగించాలనే డిమాండ్‌తో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సమైక్య ఆమరణ నిరాహార దీక్ష సోమవారం మూడవ రోజుకు చేరుకుంది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి మద్దతు కావాలని ఈ సందర్భంగా శ్రీ జగన్‌ విజ్ఞప్తి చేశారు. అన్యాయాన్ని అడ్డుకునేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కాగా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి వ్యతిరేకంగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయం వద్ద చేస్తున్న సమైక్య దీక్షకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. శ్రీ జగన్ దీక్ష ప్రారంభించిన శనివారం మొదలు ప్రతి రోజూ ఉదయం నుంచే ఆయనకు మద్దతు తెలపడానికి‌ రాష్ట్రం నలు మూలల నుంచీ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

ఇలా ఉండగా సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతు కూడగట్టేందుకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల ‌నాయకులతో భేటీ అవుతున్నది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ బృందానికి నాయకత్వం వహి‌స్తారు.

Back to Top