జగన్, విజయమ్మ, షర్మిల ప్రచారం రద్దు

హైదరాబాద్, 24 ఏప్రిల్ 2014:

పార్టీ నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి హఠాన్మరణంతో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వై‌యస్‌ విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి షర్మిల నేడు, రేపు తమ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. శోభా నాగిరెడ్డి మరణవార్త తెలియగానే వీరు తమ తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్‌కు హుటాహుటిన చేరుకున్నారు.

గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం శ్రీ జగన్ హైదరాబాద్కు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో ఉన్న‌ శ్రీమతి విజయమ్మ అప్పటికప్పడు తన కార్యక్రమాలను రద్దుచేసుకుని హైదరాబాద్ వచ్చారు. కే‌ర్ ఆస్పత్రికి వెళ్లి శోభా‌ నాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించారు. శ్రీ వైయస్ జగ‌న్ సతీమణి‌ శ్రీమతి వైయస్ భారతి‌ కూడా కడప నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రేపు మధ్యాహ్నం శోభా నాగిరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాకు వెల్లడించారు.

తాజా ఫోటోలు

Back to Top