సత్య నాదెళ్ళకు జగన్‌ అభినందనలు

హైదరాబాద్ :

సాఫ్టువేర్‌ రంగంలో అగ్రగామి అయిన మైక్రోసాఫ్టు సంస్థకు సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సత్య నాదెళ్ళకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇంత ఉన్నత శిఖరాన్ని సత్య చేరుకోవటం తెలుగువారికి గర్వకారణం అని ఒక ప్రకటనలో శ్రీ జగన్‌ పేర్కొన్నారు. సత్య నాదెళ్ళ ప్రత్యేకంగా మన రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకం అని ఆయన ప్రశంసించారు. సత్య నాదెళ్ళకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ శ్రీ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top