అమ్మ త్వరగా కోలుకోవాలి

హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రార్థించారు. ఆమె వీలైనంత త్వరగా మళ్లీ ప్రజాసేవలోకి వచ్చేందుకు దేవుడు ఆమెను అనుమతించాలని కోరుకుంటున్నానని వైయస్ జగన్ అన్నారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. గత 25 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో  'పురచ్చితలైవి' చికిత్స పొందుతున్నారు. 

తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్, మధుమేహంతో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత, అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. లండన్ నుంచి, ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి కూడా ప్రత్యేక వైద్యులు వచ్చి ఆమె చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. 

Back to Top