సభలో పచ్చనేతల హైరానా..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా సాగాయి.  ప్రత్యేకహోదా, ఓటుకు నోటు అంశాలపై సభ దద్దరిల్లింది. స్పెషల్ స్టేటస్ పై వైఎస్ జగన్ ప్రభుత్వం మెడలు వంచారు. వైఎస్సార్సీపీ డిమాండ్ మేరకు సభలో చర్చ జరిగి  తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.    అంతకుముందు సుదీర్ఘంగా సాగిన సభలో అధికారపార్టీ నేతలు జగన్ పై మూకుమ్మడి దాడికి దిగారు. ప్రజాసమస్యలపై దృష్టి మరల్చేందుకు  నానా హైరానా చేశారు. ప్రభుత్వ అవినీతి, అరాచాక పాలనపై జగన్ గొంతెత్తిన ప్రతిసారి పాలకపక్షం సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.  బాబు అండ్ కో జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. 

ప్రత్యేకహోదా, ఓటుకు నోటు కేసులో వైఎస్ జగన్ చంద్రబాబును నిలదీయడంతో ఇరకాటంలో పడిపోయారు. దీంతో,దిక్కుతోచని పచ్చ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ పై ఎదురుదాడికి దిగారు. బాబు కనుసన్నల్లో సభ ను పక్కదోవ పట్టించేందుకు అచ్చెన్నాయుడు, రావెల కిషోర్,ధూళిపాళ్ల నరేంద్ర,యనమల రామకృష్ణుడు నోటికి పనిచెప్పారు. జగన్ పై అవాకులు, చెవాకులు పేలారు.  దీనిపై ప్రతిపక్షసభ్యులు అభ్యంతరం తెలుపుతూ వెల్ లోకి వెళ్లారు. అక్కడకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఒకానొక దశలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడిచేసే ప్రయత్నం చేశారు. యాక్షన్, రియాక్షన్ రెండింటినీ ప్లే చేస్తూ చంద్రబాబు  తన టీంతో  సభలో హైడ్రామా నడిపించారు. 

ప్రత్యేకహోదా సాధ్యాసాధ్యాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలను జగన్ సభలో వివరించారు. దీంతో విస్తుపోయిన అధికారపార్టీ సభ్యులు టాపిక్ డైవర్ట్ చేసేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు మోడీ మోకాళ్ల వద్ద ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారని జగన్ నిప్పులు  చెరిగారు. నెలరోజుల్లో ప్రత్యేకహోదా తేగలరో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top