చంద్రబాబు చేస్తున్న అసలు మోసం

హైదరాబాద్: చంద్రబాబు మోసాలకు పెట్టింది పేరు అని తెలుసు కానీ, బహిరంగంగా ప్రజల్ని మరోసారి మోసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా పేరుతో చేస్తున్న మోసంలో తెలుగువారి భవిష్యత్ తెల్లారిపోయేలా ఉంది. 

ప్రత్యేక హోదా మీద చంద్రబాబు మొదలు మంత్రలు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలది ఒకటే మాట. ప్రత్యేక ప్యాకేజీలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అని. ఇందులో గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి.

రాష్ట్రాన్ని విభజించేటప్పుడు చెప్పిన అనేక అంశాల్లో ఈ రెండూ ముఖ్యమైనవి. వివిధ ప్రాంతాల్లో విద్యాసంస్థలు, వైజ్నానిక సంస్థల ఏర్పాటు, వీటితో పాటు కొన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించటం. దీన్ని విభజన చట్టంలో పొందుపరచటం జరిగింది. వీటినే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు..తాము సాధించుకొని వచ్చిన ప్యాకేజీలుగా ప్రచారం చేస్తున్నారు.

ఇక, రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రత్యేక హోదా అన్నది పార్లమెంటు వేదికగా నాటి ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ. దీనికి అప్పటి ప్రధాన ప్రతిపక్షం, నేటి అధికార పక్షం అయిన బీజేపీ మద్దతుగా నిలిచింది.

అటువంటప్పుడు ఈ రెంటిని ఇవ్వటం అన్నది కేంద్రం నైతిక బాధ్యత. వీటిని సాధించుకోవటం అన్నది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కనీస ధర్మం. చంద్రబాబు కానీ, ఆయన కోటరీ మంత్రులు కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను గాలికి వదిలేసీ ప్యాకేజీల జపం చేస్తున్నారు. 
Back to Top