హోదా భిక్ష కాదు హక్కు

ఆచంట: రాష్ట్రానికి ప్రత్యేక
హోదా డిమాండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ఆదివారం నాటి తన పాదయాత్రలో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా భిక్ష కాదని
ఆంధ్రుల హక్కు అనే ప్లకార్డును చేతపట్టుకుని ఆచంట నియోజకవర్గం మార్టేరు వద్ద పాదయాత్ర
చేశారు. స్థానిక యువత ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ
పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు వైయస్ ఆర్ కాంగ్రెస్
ప్రభుత్వాలపై వత్తిడి తెస్తూనే ఉంటుందని వైయస్ జగన్ పలు మార్లు ప్రకటించిన సంగతి
తెలిసిందే.

Back to Top