ఏపీకి ప్రత్యేకహాదా రాకుంటే యువత వలస వెళ్లాల్సిందే

కడప ఎడ్యుకేషన్‌: ఏపీకి ప్రత్యేకహాదా రాకుంటే యువత ఇతర దేశాలకు వలస వెళ్లాల్సిందేనని వైయస్సాఆర్‌ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఖాజారహ్మతుల్లా అన్నారు. ఏపీకి ప్రత్యేకహాదా కల్పించాలంటూ డిమాండ్‌ చేస్తూ శుక్రవారం వైయస్సార్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కడప సంధ్య సర్కిల్‌ నుంచి కోటిరెడ్డి సర్కిల్‌ వరకూ విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి ఒంటెద్దు బండ్లను లాగుతూ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చి మూడేళ్లైనా ఇంతవరకూ ఒక విద్యార్థికిగానీ, ఒక్క నిరుద్యోగికికానీ ఉద్యోగం రాలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రచారం నిరుద్యోగ బృతి కింద ప్రతి నిరుద్యోగికి రూ. 72 వేలు చెల్లించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు హామీ ప్రకారం ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోచి వచ్చాక నిరుద్యోగ యువత పొట్టచేతపట్టుకుని ఇతర దేశాలకు వలసలు వెళ్లాల్సి వస్తుందని ఆవేదనను వ్యక్తం చేశారు. యువతకు సరైన ఉద్యోగాలను కల్పించినప్పుడే గ్రామా«భివృద్ది సాధ్యం అవుతుందన్నారు. వైఎస్‌ జగన్‌ను చూసి ప్రత్యేక హాదా కోసం చంద్రబాబు పోరాడాలని హితువు పలికాడు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి మహమ్మద్, దత్తసాయి, జిల్లా కార్యదర్శులు నిఖిల్, అల్లాబకాస్, నిత్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top