మార్మోగుతున్న హోదా నినాదం


- హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం
- రాష్ట్ర‌వ్యాప్తంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు   
 

అమ‌రావ‌తి:  రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు రోజు రోజుకు ఉధృత‌మ‌వుతున్నాయి. పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన‌ రిలే  నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని హోదా ఆకాంక్షను చాటిచెబుతున్నారు. సత్తెనపల్లి తాలుకా సెంటర్‌ వద్ద యువత, విద్యార్థులు, దివ్యాంగులు చేపట్టిన దీక్షలను పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ హోదా కోసం ఐదు కోట్ల మంది ప్రజలు పోరాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా అలుపెరుగక పోరాడుతున్నారని వివరించారు. 

- ఈ నెల 14న దివ్యాంగులు మాచర్ల –గుంటూరు ప్రధాన రహదారిలో చేపట్టిన రాస్తారోకోలో అంబటి పాల్గొని సంఘీభావం తెలిపారు. పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లో జరిగిన రిలేదీక్షలను గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ ప్రారంభించి మాట్లాడుతూ హోదా సాధించే వరకు పోరాటం ఆగదన్నారు.
- గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం వద్ద 11 డివిజన్‌ అధ్యక్షుడు షరీఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలను నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా ప్రారంభించారు.
-  ప్రత్తిపాడులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రిలేదీక్షలను మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రారంభించారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి సుచరిత, పార్టీ నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. బాపట్ల పోస్టాఫీస్‌ సెంటర్‌లో రిలేదీక్షలను పార్టీ మండలాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పట్టణాధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు ప్రారంభించారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల ఐలాండ్‌ సెంటర్‌ వద్ద జరిగిన దీక్షలను పార్టీ నేత రేపాల శ్రీనివాసరావు ప్రారంభించారు. మాచర్లలో జెడ్పీటీసీ సభ్యుడు గోపిరెడ్డి, పార్టీ నాయకుడు ఏడుకొండలు, మరికొంత మంది కలిసి అంబేడ్కర్‌ పార్క్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 

- తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ నేతృత్వంలో రైల్వేస్టేషన్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వేమూరు నియోజకవర్గంలో వేమూరు బస్టాండ్‌ సెంటర్‌లో పార్టీ నేతల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. తాడికొండ నియోజకవర్గంలోని అడ్డరోడ్డు సెంటర్‌లో జరిగిన దీక్షలను మండల పార్టీ అధ్యక్షుడు తియ్యగూర బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. ముస్లిం మైనారిటీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
- క‌ర్నూలు జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ శిల్పాచ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో రిలే నిరాహార దీక్ష‌లు కొన‌సాగాయి
- మంత్రాలయంలో హోదా సాధనకు  చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజు శనివారం కొనసాగాయి. శనివారం నాటి దీక్షలో మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన దాసు, హనుమంతు, లక్ష్మయ్య, గోపీనాథ్, సత్తిరెడ్డి, మునెప్ప, నాగరాజు, వెంకోబా, సురేష్, వీరనాగుడు, అయ్పప్ప, రామాంజినేయులు, రామయ్య, తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజుతో పాటు మరి కొంత మంది కార్యకర్తలు కూర్చున్నారు. ముందుగా రాఘవేంద్రసర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు.
 - కురుపాంలోని రావాడ కూడలిలో పార్టీ నాయకులు శనివారం రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో జరి గిన ఈ దీక్షలో అరుకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీ పీ ఆనిమి ఇందిరా కుమారి, ఐదు మండలాల కన్వీనర్లు, జిల్లా అధికార ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

► విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పార్టీ నగర కన్వీనర్‌ ఆశపు వేణుతో పాటు  ఇతర నాయకులు పాల్గొనగా పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి దీక్షలో పాల్గొన్న వారికి పూలదండలు వేసి ప్రా రంభించారు.పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ జి ల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు దీక్షా శిబి రాన్ని సందర్శించి సంఘీభావం తెలి పారు.  
 

Back to Top