పాద‌యాత్ర‌లో ప్ర‌త్యేక హోదా

- ఫ్ల‌కార్డ్సుతో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో మారుమ్రోగిన హోదా నినాదం
ప్ర‌కాశం: ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌నే ధ్యేయంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఒక‌వైపు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జాప్ర‌తినిధులు, వేలాది మంది పార్టీ శ్రేణులు ఢిల్లీ వేదిక‌గా ధ‌ర్నా చేస్తుండ‌గా మ‌రో వైపు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్న పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేస్తూ ఫ్ల‌కార్డ్సు ప‌ట్టుకొని ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఆయ‌న‌తో పాటు వేలాది మంది పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దించారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం స్పందించ‌క‌పోవ‌డంతో ఈ ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేశారు. ఇందులో భాగంగా  ఈనెల 1న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేప‌ట్టారు. ఈ నెల‌ 3న పార్టీ నేతల‌ను వైయ‌స్ జ‌గ‌న్ జెండా ఊపి ఢిల్లీకి  పంపించారు. ఇవాళ ఢిల్లీలో హోదా కోసం ధర్నా చేస్తున్నారు. మంగళవారం నుంచి పార్లమెంట్‌ వేదికగా వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తారు. అప్పటికీ కేంద్రం దిగి రాకపోతే మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం పెడతారు. అయినా కేంద్రం స్పందించకపోతే ఏప్రిల్‌ 6న పార్టీ ఎంపీలు రాజీనామా చేసి వాళ్ల ముఖాన కొట్టి రాష్ట్రానికి వస్తారు. అవిశ్వాసానికి చంద్రబాబు ముందుకు రారట.. రాజీనామాలకూ ముందుకు రారట. కేంద్ర మంత్రి వర్గం నుంచి తన మంత్రుల్ని ఉప సంహరించడం ఆఖరి అస్త్రమట. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. హోదా ఉంటే ఆదాయపన్ను, జీఎస్టీ మినహాయింపు, కరెంటు రాయితీలుంటాయి. అవి ఉంటే ఎవరైనా వచ్చి పరిశ్రమలో, హోటళ్లో, ఆస్పత్రులో పెడతారు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు. పూటకో మాట, రోజుకో నాటకం ఆడుతున్నారు. ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి కనుక హోదా కోసం తొలి అస్త్రంగా కేంద్రం నుంచి వైదొలుగుతూ మంత్రులు రాజీనామా చేయాలి.   
Back to Top