వైయస్‌ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం

ప్రజల కోసం రాజీనామా చేయడం సంతోషం
టీడీపీ, బీజేపీలు ఆంధ్రరాష్ట్రాన్ని మోసం చేశాయి
వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రరాష్ట్ర ప్రజానీకాన్ని నట్టేట ముంచాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఒత్తిడి తీసుకురానందు వల్లే హోదా ఇవ్వలేదన్నారు. ప్రత్యేక హోదా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టింది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందునే రాజీనామాలు చేశామని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని కేంద్రమంత్రులు, అధికారులను కలుస్తున్నామని వరప్రసాద్‌ చెప్పారు. నిన్న ఓఎస్‌జీసీ అధికారులను కలిశామని, వాటర్‌ప్లాంట్స్‌ నిర్మించాలని కోరామన్నారు. అదే విధంగా రుయాకు రూ. 50 కోట్లు, స్విమ్స్‌ అభివృద్ధికి రూ. 50 కోట్లు నిధులు ఇవ్వాలని కోరాడం జరిగిందన్నారు. విభజన హామీలు నెరవేరాలంటే వైయస్‌ జగన్‌ అధికారంలోకి రావాలన్నారు. 
Back to Top