ప్రత్యేక హోదా వైయ‌స్ జగన్‌తోనే సాధ్యం

విశాఖ‌:  రాష్ట్రానికి ప్రత్యేకహోదా వైయ‌స్‌ జగన్‌మోహనరెడ్డితోనే సాధ్యమవుతుందని పార్టీ మండల కన్వీనర్‌ మళ్ల సంజీవరావు అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న వైయ‌స్ జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు.  ఈనెల 22న యలమంచిలి నియోజకవర్గంలోని అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల్లో మత్స్యకారులు, నిర్వాసితులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ జగన్‌మోహనరెడ్డి పర్యటిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇందుకు సంబందించి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతూ మంగళవారం మండలంలోని ఉమ్మలాడ, నాగులాపల్లి, ఒంపోలు, అరబుపాలెం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈసందర్బంగా సంజీవరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైయ‌స్ జగన్‌మోహనరెడ్డికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నఆయ‌న‌ సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. ప్రత్యేకహోదా ద్వారా రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top