ప్రత్యేకహోదా మీ అత్తసొత్తా బాబూ..?

()హోదా పదేళ్లు, 15 ఏళ్లు కావాలని ఊదరగొట్టారు
()అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయిస్తున్నారు
()బాబు, వెంకయ్యలు హోదాను ఎగతాళి చేస్తున్నారు
()ఐదుకోట్ల ఆంధ్రులను టీడీపీ, బీజేపీలు మోసం చేశాయి
()హోదా కోసం రెండున్నరేళ్లుగా పోరాడుతున్నాం..పోరాడతాం
()ప్రతిపక్ష నేత వైయస్ జగన్

పశ్చిమగోదావరి జిల్లా(ఏలూరు)) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు పదేళ్లు, 15 ఏళ్లు ఇవ్వాలని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు, బీజేపీ పెద్దలు...ఎన్నికలయిపోయాక ప్రజలతో పనైపోయిందని హోదా ఇవ్వకుండా మోసం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి....ఇవాళ హోదా వల్ల ఏం వస్తాయంటూ చంద్రబాబు, వెంకయ్యనాయుడులు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏలూరులో యువభేరి కార్యక్రమంలో టీడీపీ, బీజేపీలు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని విద్యార్థులు, యువతకు తెలియజెప్పారు.

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
()ప్రత్యేకహోదా వల్ల కలిగే మేలు గురించి ప్రతీ చోట ఎడ్యుకేట్ చేస్తూ పోతున్నాం. హోదా కోసం రెండేళ్లుగా పోరాటం సాగిస్తున్నాం. 
()టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి హోదా అడుగుతూ వచ్చాం. పోరాటాలు చేశాం. ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నాలు చేశాం. రాష్ట్రంలో బంద్ లు, ధర్నాలు చేస్తున్నాం. నిరాహార దీక్షలు చేశాం. యువభేరి కార్యక్రమం ద్వారా ప్రతీ చోట హోదా కోసం గట్టిగా నిలదీస్తున్నాం. రెండున్నరేళ్లయిపోయింది. ఇంతవరకు ఏమీ చేయలేదు.   
()మన ప్రమేయం లేకపోయినా, ఒప్పుకోకపోయినా  ఎంపీలను సస్పెండ్ చేసి, లైవ్ కట్ చేసి, పార్లమెంట్ తలుపులు మూసేసి అడ్డగోలుగా అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. 
() ఏపీకి హైదరాబాద్ లేకుండా పోతోంది. అన్యాయం జరుగుతోంది.  చదువుకున్నప్రతీ పిల్లాడు హైదరాబాద్ పోతాడు. 90 శాతం ఐటీ, 70 శాతం మానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అక్కడే ఉంది. హోదా లేకపోతే నష్టం జరుగుతుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఆనాటి అధికార, ప్రతిపక్షాలు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టాయి. 
()ప్రత్యేకహోదా  కాంగ్రెస్ ఐదేళ్లు అంటే, కాదు పదేళ్లు ఇవ్వాలని ప్రతిపక్షంలోని బీజేపీకి చెందిన అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ఆరోజు డిమాండ్ చేశారు. బాబు పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలని ఎలక్షన్ సభలో ఊదరగొట్టారు. 
()రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాక రకరకాలుగా మాట్లాడారు.  తాము అధికారంలోకి వస్తే హోదా పదేళ్లు ఇస్తాం, 15 ఏళ్లు ఇస్తామని చంద్రబాబు, బీజేపీ పెద్దలు ఎన్నికలకు వెళ్లి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. హోదా సంజీవని, హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయని ఎన్నికల సమయంలో వేదికల మీద ఊదరగొట్టారు. ఓట్లు వేయించుకున్నాక ప్లేటు ఫిరాయిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధనిపిస్తోంది.
() సెప్టెంబర్ 7న అర్థరాత్రి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టారు. బాబుకు సంబంధించిన వ్యాపారవేత్త, కాంట్రాక్టర్లు, మంత్రులు, ఎంపీలు జైట్లీ పక్కన ఉన్నారు. ఏపీకి దమ్మిడి కూడా ఇస్తామని చెప్పలేదు. పైగా హోదా ఇవ్వబోమని చెప్పారు. ఢిల్లీలో అరుణ్ జైట్లీ అలా చెప్పడమే ఆలస్యం అదే రోజు అర్థరాత్రి ముఖ్యమంత్రి పిక్చర్లోకి వచ్చేశారు. జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నాను అంటాడు. ఆశ్చర్యమనిపించింది. హోదా ఇవ్వమని వాళ్లు చెబుతుంటే...స్వాగతిస్తున్నానంటాడు.  అసలు ఈమనిషికి ఇంగ్లీష్ వస్తుందా అని  డౌట్ వచ్చింది. 
()దానికి ముందు  రోజు పొద్దున్నుంచి అదిగో హోదా వస్తుంది, జైట్లీ ప్రకటిస్తున్నారని రకరకాలుగా టీవీ చానల్లో ఊదరగొట్టారు. ఉసూరుమనిపించారు.  
() జైట్లీ ప్రకటనను స్వాగతించడానికి నీవెవరని బాబును అసెంబ్లీలో గట్టిగా నిలదీశాం. ప్రత్యేకహోదా మీ నాయన, అత్తసొత్తా ..? ఐదు కోట్లమంది ప్రజల జీవితాలు హోదాపై ఆధారపడి ఉన్నాయి. చదువు అయిన పిల్లాడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎవరికి ఇష్టం లేకపోయినా నీవెవరు స్వాగతించడానికి అని నిలదీస్తే మాట్లాడే ధైర్యం లేక బాబు శాసనమండలికి పోయాడు. అక్కడ ఇంకా ఆశ్చర్యంగా మాట్లాడాడు. హోదా వల్ల ఏం వస్తాయి. ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ కు ఏం మేలు జరిగింది అని అంటాడు. 
() ఇదే చంద్రబాబు ఎన్నికలకు హోదా పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలన్నాడు. హోదా ఇవ్వాలని అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి పంపుతాడు...మళ్లీ ఇదే మనషి మండలిలోకి వచ్చి ప్లేటు మార్చి హోద వల్ల ఏం జరిగిందని పట్టపగలు అబద్ధాలు ఆడుతున్నాడు. 
()బాబు చేస్తున్న మోసం ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే...హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెబుతుంటే బాబు ప్రధానికి ఫోన్ చేసి థ్యాంక్యూ అని చెబుతాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సమంజసమా...?
()జైట్లీ స్టేట్ మెంట్ వచ్చినప్పుడు బాబు వెంకయ్యనాయుడును విజయవాడకు పిలిపించి మంత్రుల చేత సన్మానం చేపిస్తడు. హోదా ఇవ్వకపోయినా బ్రహ్మాండంగా ప్యాకేజీ ఇచ్చారు అని ప్రధానికి థ్యాంక్యూ చెప్పడం. వెంకయ్యనాయుడుకు సన్మానాలు చేయడం. ఢిల్లీకి పోయి జైట్లీకి శాలువా కప్పి థ్యాంక్యూ అని చెప్పడం ఆశ్చర్యమనిపిస్తోంది. 
()ఇక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మొన్నటిదాకా హోదా సంజీవని అన్నాడు. నావల్లే వస్తుందని ఊదరగొట్టాడు. హోదా వల్లే అన్నీ జరుగుతాయని చెప్పాడు. పదేళ్లు కావాలని ఆనాడు పార్లమెంట్ లో అడిగాడు. ఇవాళ ప్లేటు మార్చాడు. ఆరోజు నేను వేడిమీద ప్రత్యేకహోదా అడిగానంటాడు. అంతటితో ఆగలేదు . మిగతా రాష్ట్రాల నాయకులు వచ్చి నీకు బుద్ది ఉందా ఏపీకి హోదా అడుగుతావా అని అడిగితే వెంకయ్యనాయుడు బాధపడ్డాడట. ఆవిషయం రెండేళ్ల తర్వాత చెబుతాడు. పైగా హోదాను ప్రస్తావిస్తూ అంటాడు. మేకకు వేలాడుతుంటాయి కదా హోదా అంటే అదే అంటాడు. 
()వీళ్లు ఇంత దుర్మార్గంగా, అన్యాయంగా ఎన్నికలప్పుడు మాటలు చెప్పి ....ప్రజలతో పని అయిపోయాక పార్లమెంచట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నీరుగారుస్తూ గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. హోదా కావాలని మొన్నటి దాకా చెప్పి...ఇప్పుడు హోదాతో ఏమొస్తదని ప్రచారం సాగించడం దారుణమని వైయస్ జగన్ అన్నారు. 

Back to Top