ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యం


* హోదా ఎవ‌రు ఇస్తే వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేస్తాం
* రాజ‌కీయ ల‌బ్ధికోసం టీడీపీ ఎంపీలు డ్రామాలు
* తన వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై బాబు నెపం
* బాబు వ‌ల్ల రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోతోంది
* మీడియాతో విజ‌య‌సాయిరెడ్డి

చ‌ంద్ర‌బాబు నాయుడు త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై నెపం వేస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. నాలుగేళ్లుగా కేంద్రం బాగా చేస్తోంద‌న్న చంద్ర‌బాబు మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఇప్పుడు కేంద్రంపై నింద‌లు వేసి తాను త‌ప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.  ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీకి చిత్త‌శుద్ధిలేద‌ని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ ఎంపీలు సైతం వాళ్ల రాజ‌కీయ ల‌బ్ధికోసం పార్ల‌మెంట్‌లో ఏదో ఆందోళ‌న చేశామంటే చేశామ‌న్న‌ట్లు చేసి మ‌మ అనిపించార‌న్నారు. బాబు పాల‌న‌లో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింద‌ని, రాష్ట్రంలో అబినీతి పెరిగిపోయింద‌న్నారు. 
ప్ర‌త్యేక హోదా అన్న‌ది రాష్ట్రానికి ప్రాణ‌వాయువు అని, అదొక సంజీవ‌ని అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.  ప్ర‌త్యేక హోదా ఎవ‌రు ఇస్తే ఆ పార్టీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి తాము సిద్ధ‌మ‌న్నారు. హోదా వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని, హోదా ఉంటేనే మ‌నం పొరుగు రాష్ట్రాల‌తో పోటీప‌డ‌గ‌ల‌మ‌న్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కు తాము పోరాటం చేస్తామ‌ని విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. 
Back to Top