హోదా సాధ‌నే ధ్యేయం

() ప్ర‌త్యేక హోదా సాధ‌నే ధ్యేయంగా మంగ‌ళ‌వారం ఆందోళ‌న‌
() కాకినాడ‌లో క‌లెక్ట‌రేట్ దగ్గ‌ర ధ‌ర్నాలో పాల్గొన‌నున్న వైఎస్ జ‌గ‌న్‌
() ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి

కాకినాడ‌) రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ ఒక్కటే పోరాడుతోందని వైయ‌స్సార్సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధనపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష నేతల్ని వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రత్యేక హోదా సాధనకోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఈనెల 10న ధర్నాలు నిర్వహించాలని పార్టీ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో మంగ‌ళ‌వారం ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్నారు.  ఈ నేపథ్యంలో ఆదివారం కాకినాడ వచ్చిన విజయసాయిరెడ్డి, పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు ధర్నా నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించారు.

ఏర్పాట్లపై పార్టీ తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, సిటీ ప్రెసిడెంట్ రాగిరెడ్డి ఫ్రూటీకుమార్‌లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
వైయ‌స్సార్సీపీ ఒక్క‌టే పోరుబాట‌
ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ మొదటి నుంచీ హోదా విషయంలో తన వంతు పాత్ర పోషిస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుస‌ని విజ‌య‌సాయిరెడ్డి ఈ సంద‌ర్భంగా అన్నారు.  తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో దీక్ష, గుంటూరులో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణదీక్ష చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్నా చంద్రబాబుకు గుర్తు లేకపోవడం విడ్డూరమన్నారు. హోదా సాధించే వరకు తమ పార్టీ ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రత్యేక హోదా సాధనలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.  తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల మాదిరిగా రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా వస్తేనే సాధ్యమవుతుందనే విషయం బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, 15 ఏళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు హోదా విషయంలో మాట మార్చడం ఎంతవరకు సమంజసమన్నారు.

To read this article in English:  http://bit.ly/1ZvQvpf 

Back to Top