హోదా సాధించగల ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌

గుంటూరు: ప్రత్యేక హోదా లక్ష్య సాధన రథసారధి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని లావు విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరులో తలపెట్టిన యువభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మూడు సంవత్సరాలు అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు అమలు చేయలేకపోయాయన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ ద్వారా ఉన్నత చదువులు చదువుకున్న ఎంతోమంది పేద విద్యార్థులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రావాలంటే.. ప్రత్యేక హోదా రావాలన్నారు. ప్రత్యేక హోదా సాధించగల ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామనే ఒక్క అబద్ధం చెప్పలేక ప్రతిపక్షంలో కూర్చున్న వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధి గల నాయకుడని చెప్పారు. ఏదైనా విషయం గురించి పోరాడితే దాన్ని చివరకు తీసుకెళ్లి సాధించగల వ్యక్తి వైయస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వైయస్‌ జగన్‌కు విద్యార్థులంతా మద్దతు ఇవ్వాలని, వైయస్‌ జగన్‌తో కలిసి పోరాడి హోదా సాధించుకోవాలని సూచించారు.

Back to Top