బాబు అసమర్థత వల్లే హోదా రాలేదు

నెల్లూరు: చంద్రబాబు నాయుడు అసమర్థత వల్లే రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా రాలేదని రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ఏపీ ప్రయోజనాల కాపాడేందుకు వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ పదవులకు రాజీనామాలు చేశామని వరప్రసాద్‌ చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేనిపక్షంలో రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఓ అహంకారి అని.. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర వనరులను తాకట్టుపెట్టారని ఆరోపించారు. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మరోసారి వంచిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గానికి వ్యతిరేకంగా నెల్లూరులో వంచనపై గర్జన దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. హోదా రాకపోవడానికి 40 శాతం కేంద్ర తప్పిదాలు కారణమైతే, 60 శాతం అసమర్ధుడైన చంద్రబాబు నాయుడే కారణమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని టీడీపీ, కేంద్రంలోని బీజేపీ కలిసి ఏపీని వంచించాయని వరప్రసాద్‌ పేర్కొన్నారు. 
Back to Top