ప్ర‌త్యేక హోదా ఇప్పించాల్సిందే..!

ఢిల్లీ:  లోక్ స‌భ లో ప్ర‌త్యేక హోదా అంశాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌స్తావించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని కేంద్రమే హామీ ఇచ్చింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ విషయంపై ఏపీకి కేంద్రం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని లోక్ సభలో డిమాండ్ చేశారు. రైతులకు 100 శాతం రుణాలు ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని వ్యాఖ్యానించారు. 2018 లోగా పోలవరం నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పుడు ఇస్తున్న నిధుల కేటాయింపులు సరిపోవు అని పేర్కొన్నారు. జన్ ఔషధ్ కేంద్రాల ఏర్పాటు అనుకున్న లక్ష్యాలకు తగ్గట్లుగా లేవని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభలో ఈ సమస్యలను లేవనెత్తారు.
Back to Top