ప్ర‌త్యేక హోదాయే ముఖ్యం

 • ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలను సరిచేయాలి
 • పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం మూడు మాసాల్లో రద్దు చేయాలి
 • ఆ అధికారాల్ని స్పీకర్ నుంచి తప్పించి స్పీకర్ కు ఇవ్వాలి
 • విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలి..ఎంపీ నిధులను పెంచాలి

న్యూఢిల్లీః ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాల‌ను స‌రిచేయ‌క‌పోతే ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ భ్ర‌ష్టుప‌ట్టే పరిస్థితి వస్తుందని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ అన్నారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను లాఫింగ్ స్టాక్‌గా త‌యారు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వారికై వారు రాజీనామా చేస్తే బాగుంటుంద‌ని... లేక‌పోతే మూడు నెల‌ల్లో వారి స‌భ్య‌త్వం ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న కోరారు. ఆ అధికారాన్ని స్పీక‌ర్ నుంచి త‌ప్పించి ఎల‌క్ష‌న్ అధికారికి ఇవ్వాల‌న్నారు. న్యూఢిల్లీలోని పార్ల‌మెంటు ఆవ‌ర‌ణలో మీడియాతో మాట్లాడుతూ ఆయనేమన్నారంటే...

 • విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలి.
 • ఏపీకి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి, విశాఖ‌లో రైల్వే జోన్ ఏర్పాటు, అమ‌రావ‌తిలో  రాజ‌ధాని, వెన‌క‌బ‌డిన ప్రాంతాలైన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌ర‌ాంధ్రలకు స్పెష‌ల్ ప్యాకేజీలు ఇస్తామ‌న్న హామీల‌ను వెంట‌నే అమ‌లు చేయాలి.
 • విశాఖ‌ప‌ట్నం - చెన్నై, బెంగ‌ళూరు - చెన్నై ఇండస్ట్రీయ‌ల్ కారిడ‌ార్స్ ను వెంట‌నే చేప‌ట్టాలి.
 • పార్లమెంట్ లో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేకహోదాను ప్రకటించాలి. లేక‌పోతే ప్ర‌జాస్వామ్యం అప‌హాస్యం పాల‌వుతుంది.
 •  తెలంగాణ‌లో శాస‌న‌స‌భ్యుడికి రూ. 3 కోట్లు, కేర‌ళ‌లో రూ. 6 కోట్లు ఇస్తున్నార‌ు. పార్ల‌మెంట్ స‌భ్యుడికి కేవలం రూ. 5 కోట్లు మాత్ర‌మే ఇవ్వ‌డం దారుణం.
 • ప్ర‌తి మోడ‌ల్ విలేజ్కు కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఇవ్వాల్సి వ‌స్తుంది. 
 • ఇప్ప‌టికైనా ఎంపీ నిధులు రూ. 5 కోట్ల నుంచి ఎక్కువ‌కు పెంచాలి.
 • పార్ల‌మెంట్‌లో యాంటిడిఫెక్ష‌న్ బిల్లును అమ‌లు చేయాలి. 
 • ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేశారు. 
 • ఎంపీ విజయసాయిరెడ్డి మూవ్ చేసిన ప్రైవేట్ మెంబర్స్ బిల్లుకు బేషరతుగా మద్దతు పలుకుతాం.
 • కేంద్ర ప్ర‌భుత్వం నేరుగా అభ్య‌ర్థిస్తున్నందునే జీ  ఎస్ టీ బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ాం. 
 • దేశంలో పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్థను కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తిపార్టీకి ఉంది.

Back to Top