ప్రత్యేకహోదాయే బ్రహ్మాస్త్రం

గుంటూరుః ప్రత్యేకహోదాపై వైయస్ జగన్ మరోసారి గర్జించారు. ఐదు కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించుకునేందుకు విద్యార్థులు, యువతను యువభేరి ద్వారా వైయస్ జగన్ చైతన్యవంతులను చేశారు. హోదాపై విద్యార్థుల సందేహాలను వైయస్ జగన్ నివృత్తి చేశారు. 

స్పీకర్‌ వ్యాఖ్యలు బాధాకరం:  వినీలా, బీటెక్‌ విద్యార్థిని
ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అమ్మాయిల గురించి చెడ్డగా మాట్లాటం బాధాకరం. శాసనసభాపతి అయిన వ్యక్తే ఆడవాళ్లపై ఇలా మాట్లాడితే మాకు రక్షణ ఎవరూ. ఎమ్మెల్యే రోజాను కూడా సభకు రాకుండా అడ్డుకున్నారు. తాజాగా మహిళా పార్లమెంట్‌ సదస్సుకు రాకుండా నిర్భందించారు. ఇదే చంద్రబాబు మహిళా సదస్సుపై నేషనల్‌ మీడియా ఒక పార్టీకి అమ్ముడపోయిందని ఆరోపించారు. ఇది ఎంతవరకు నిజం.

వైయస్‌ జగన్‌: నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి  దగ్గరుండి తప్పు మాట్లాడిన వారిని అడగాలి. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి తప్పు చేసినా ఫర్వాలేదు అని సీఎం చంద్రబాబు వత్తాసు పలకడం దౌర్భగ్యం. ఆడవాళ్లకు నేను రక్షణ కల్పిస్తానని చెప్పాల్సిన సీఎం, ఆడవాళ్లపై కన్నేస్తే కనుగుండ్లు పీకుతానని హెచ్చరించాలి. ఇక్కడ మాత్రం సాక్ష్యాత్తు టీడీపీ ఎమ్మెల్యే తప్పుచేస్తే ఏమీ అనరు. మహిళా ఎంఆర్‌వో జుట్టుపట్టుకొని లాక్కెళ్లినా బాబు చర్యలు తీసుకోరు. విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే నిందితులను ప్రభుత్వమే రక్షిస్తోంది. విజయవాడలో అబలలకు అప్పులిచ్చి, వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి సెక్స్‌రాకెట్‌ నడిపిస్తే..అలాంటి వారిపై చర్యలు తీసుకోరు. అంగన్‌వాడీలకు తోడుగా నిలబడాల్సిన వ్యక్తి..తన ఎమ్మెల్యేకు తోడుగానిలబడ్డాడు. ఇవాళ ఏపీలో ఆడవాళ్లపై అత్యాచారాలు అధికమయ్యాయని డీజీపీ చెబుతున్నారు. చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి.
–––––––––––––––––––
టీడీపీ నేతలు ఇక్కడేందుకు పరిశ్రమలు పెట్టరు:  వెంకట్, బీటెక్‌
గుంటూరు జిల్లా ఎంపీ గల్ల జయదేవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టారు.

వైయస్‌ జగన్‌: ఉత్తరాఖండ్‌లో టీడీపీ నేతలు ఎందుకు పెట్టుబడులు పెట్టారని వెంకట్‌ అడుతున్నారు. అదే పరిశ్రమలు ఇక్కడ పెడితే యువతకు ఉద్యోగాలు వచ్చేవి. ఈ ప్రశ్నతోనైనా బాబుకు జ్ఞానోదయం వస్తుందేమో.
––––––––––––––––––––––––––––––––––––
 బాబును ఎందుకు అరెస్టు చేయడం లేదు:  శ్రీవిద్య. బీటెక్‌
అన్నా..మనందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటే ఆ వ్యక్తిని సస్పెండ్‌ చేస్తారు. విద్యార్థి కాపీ కొడితే డీబార్‌ చేస్తారు. చంద్రబాబు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా ఎందుకు అరెస్టు చేయడం లేదు.

వైయస్‌ జగన్‌: దేశ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినట్లు చూడలేదు. సాక్ష్యాత్తు సీఎం స్థాయి వ్యక్తి నల్లధనం ఇస్తూ దొరికిపోయారు. అలాంటి వ్యక్తి పదవికి రాజీనామా చేయాలి. అయితే ఏపీలో చంద్రబాబును అరెస్టు చేయరు. ఇదే చంద్రబాబు ప్రత్యేక హోదా అడకకుండా ఎందుకు లాలూచీ పడ్డారంటే..కారంణం ఓటుకు కోట్లు కేసులో విచారణ జరుగకుండా ఉండేందుకు కేంద్రానికి హోదాను తాకట్టు పెట్టారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు తాను కడుతానని తీసుకున్నారు. బాబుకు జ్ఞానోదయం కలగాలని ఆశీస్తున్నాను.
––––––––––––––––
వైయస్‌ జగనన్న వెంటే ఉంటాం:  సాయిరెడ్డి
మన రాష్ట్రాన్ని అడ్డంగా  విడదీసేటప్పుడు ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. పార్లమెంట్‌లో బీజేపీ పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. టీడీపీ పదిహేనేళ్లు అని తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ నేతలు ప్రత్యేక ప్యాకేజీ కావాలంటున్నారు.  అసలు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నారా? లేదో తెలియదు. మా బాధలు ఎవరు పట్టించుకుంటారాన్న. చిలకలూరిపేటలో మంత్రి దోచుకో..దాచుకో మాదిరిగా పనిచేస్తున్నారు. హోదా కోసం పోరాటం చేస్తే మాపై పీడీ యాక్టులు పెడుతామని హెచ్చరిస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైయస్‌ జగనన్న వెంటే ఉంటాం. హోదా కోసం పోరాటం చేస్తాం.

వైయస్‌ జగన్‌: ప్యాకేజీ అంటే ఏంటీ..రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు ఏదైతే ఇస్తామన్నారో అంతకంటే ఎక్కువ ఇస్తే దాన్ని ప్యాకేజీ అంటారు. మనకు రావాల్సింది ఇవ్వకుండా దానికే ప్యాకేజీ అంటే బాబు స్వాగతించారు.
–––––––––––––
ఇదేనా ప్రజాస్వామ్యం:  సరళా, బీటెక్‌
రాష్రంలో అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే కేసులు పెడుతున్నారు.  మొన్న ప్రత్యేక హోదా కోసం క్యాండిల్‌ ర్యాలీకి వెళ్తే విశాఖలో మిమ్మల్ని రన్‌వేపైనే అడ్డుకున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం 

వైయస్‌ జగన్‌: బాబు హయాంలో ప్రజాస్వామ్యానికి విలువ లేదు. రిపబ్లిక్‌ డే రోజునే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్భందించారు. ఇదే కాదు..మనం ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తులను చంద్రబాబు తన పార్టీలోకి లంచాలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. వాళ్లను డిస్‌క్వాలీఫై చేయకుండా భారీగా లెక్చర్లు ఇస్తారు. అడ్డగోలుగా బ్లాక్‌మనీ ఇస్తూ దొరికిపోతారు. మళ్లీ రోడ్లపైకి వచ్చి పిల్లలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పూర్వం జపాన్‌లో గ్లోబెల్‌ అనే వ్యక్తి ఉండేవారు. ఒకే అబద్ధాన్ని వందసార్లు మీడియా ద్వారా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. అదే ప్రయత్నాలు ఇప్పుడు  చంద్రబాబు చేస్తున్నారు. ఒకసారి  బాబు మాటలు నమ్మారు. మళ్లీ నమ్మే పరిస్థితి లేదు. 
......................................
కేసు కోసం హోదాను తాకట్టుపెట్టారు
హర్షవర్థన్, నాగార్జున యూనివర్సిటీ ఎంఏ
జనవరి 26వ తేదిన హోదా కోసం శాంతియుత నిరసన ర్యాలీ చేస్తుంటే మమ్మల్ని 144 సెక్షన్‌ పెట్టి రోడ్ల మీద పిచ్చికక్కుల్లా పరిగెత్తించారు. పోలీసులు బాగా హ్యాండిల్‌ చేశారు. రాష్ట్రం తగలబడిపోతుందనుకున్నా అని చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కొని ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టుపెట్టి ప్రత్యేక ప్యాకేజీ మంచిదంటున్నారు. జగనన్నా మీ వెనుక మీమున్నాం.. ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తాం.. హోదా సాధన కోసం మీ వెంట నడిచొస్తాం.

బాబుపైనే టాడా కేసు పెట్టాలి
వైయస్‌ జగన్‌: అందరం కలిసికట్టుగా ఉంటేనే హోదా సాధించగలం.. హోదా ఉద్యమాన్ని 2019లో ఎన్నికలు జరిగితే ఏ కేంద్ర పార్టీ అయినా ఏపీలో మాట్లాడాల్సివస్తే హోదా ఖశ్చితంగా ఇస్తామని హామీ ఇస్తే తప్ప మీటింగ్‌లు పెట్టే పరిస్థితి తీసుకురావాలి. హోదాను ఎన్నికల రెఫరెండం కిందకు మార్చాలి. ఆ స్థాయిలోకి తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరి సహాయం కావాలి. మనం పోరాడుతుంది మన హక్కు కోసం.. ఇవ్వాల్సింది వాళ్ల బాధ్యత. చంద్రబాబు పొరబాటున ఏమైనా కేసులు పెడితే మాత్రం మీ అందరికీ  హామీ ఇస్తున్నా.. బాబు ప్రభుత్వం ఎల్లకాలం సాగదు. ఆ తరువాత వచ్చేది మన ప్రభుత్వం.. బాబు పెట్టిన కేసులను వెనక్కు తీసుకుంటాం. పిల్లలని చూడకుండా ఇంత దారుణంగా కేసులు పెడుతున్న చంద్రబాబుపై టాడా కేసు ఎందుకు పెట్టకూడదని అడుతున్నా... కనీసం ఇప్పటికైనా జ్ఞానదయం కావాలని ఆశిస్తున్నా...
–––––––––––
బాబు చీఫ్‌ మినిస్టర్‌ కాదు చీట్‌ మినిస్టర్‌
ప్రవళ్లిక, విద్యార్థిని
ఎన్నికల సమయంలో హోదా ఇస్తామని చంద్రబాబు, వెంకయ్య పది, పదహేను సంవత్సరాలు అంటూ పోటీ పడ్డారు. ఈ రోజు అవి అడగడానికి మనకు హక్కులున్నాయి. మనకు మాత్రమే కేంద్రం రాయితీలు వచ్చాయని చంద్రబాబు చెప్పే మాటలు నమ్మేవారు ఇక్కడ ఉన్నారా అన్నా.. చంద్రబాబుని చీఫ్‌ మినిస్టర్‌ అని ఎవరూ అనరు.. చీట్‌ మినిస్టర్‌ అంటారు. ఈ రోజుకు నేను చదువుకుంటున్నానంటే వైయస్‌ఆర్‌ ఫీజు రియంబర్స్‌మెంట్‌ వల్లే నేను చదువుకోగలుగుతున్నా.
–––––––––––––
బుద్ధిలేక చంద్రబాబుకు ఓటేశాం
దేవానంద్, నలంద కాలేజ్‌
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆంక్షలు లేని ఫీజు రియంబర్స్‌మెంట్‌ ఇస్తామన్నారు. ఎన్నికల తరువాత అన్ని ఆంక్షలు విధిస్తున్నారు. బీసీ విద్యార్థులు 8 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకుంటే లక్షా 20 వేల మందికి పైగా స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేదన్నా.. బుద్ధిలేక చంద్రబాబుకు ఓట్లేసి బాధపడుతున్నామన్నా.. మీకోటేసి మిమ్మల్ని గెలిపిస్తాం.. మీరొచ్చాక స్కాలర్‌షిప్‌లు ఇవ్వండన్నా...

వైయస్‌ జగన్‌: 15.80,218 మంది ఫీజు రియంబర్స్‌ కోసం అప్లికేషన్‌ పెడితే దీంటో 13,18 వేల మందికి మాత్రమే ఎంపిక చేశారు. దాదాపు 2 లక్షల 60 వేల మంది స్కాలర్‌షిప్‌లను నిర్ధాక్షిణ్యంగా కత్తిరించారు. కనీసం ఫీజు రియంబర్స్‌మెంట్‌ అయినా కరెక్ట్‌గా ఇస్తున్నారంటే అది కూడా లేదు. రూ. 2,255 కోట్లు అన్నారు. సంవత్సరం కావోస్తుంది ఇంత వరకు రూ. 686 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ప్రియతమనేత వైయస్‌ఆర్‌ ప్రతిపేదవాడు చదవాలి.. చదువుకు పేదరికం అడ్డుకాకూడదు అని ఫీజు రియంబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు. పేదవారు ఒక్కరైనా ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ కావాలి అని మీరు చదవండి.. నేను చదివిస్తాను మీ తండ్రిలా.. అన్నలా భరోసా కల్పించారు. ఇవాళ అదే రియంబర్స్‌మెంట్‌ పథకాన్ని దగ్గరుండి చంద్రబాబు నీరుగారుస్తున్నారు. బీసీలపై చంద్రబాబుకున్న ప్రేమ ఇస్తీ్ర పెట్టెలు ఇవ్వడానికి, కత్తెరలు ఇవ్వడానికి తప్ప బీసీలపై ప్రేమ చూపించింది లేదు. పేదవాడికి తోడుకుగా నిలబడింది వైయస్‌ఆర్‌ అని గర్వంగా చెప్పుకుంటా. ఆయన మరణం తరువాత పీజు రియంబర్స్‌మెంట్‌ను అవహేళన చేస్తున్నారు. ఇంజనీరింగ్‌కు అయ్యే పూర్తి ఫీజు నాన్నగారే కట్టేవారు. డాక్టర్‌ చదువులకు నేనున్నానని భరోసా ఇచ్చేవారు. ఇవాళ కాలేజీల్లో ఫీజులు పెంచడానికి చంద్రబాబు గ్రిన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో పేదవారు చదువు మానుకునే పరిస్థితికి వెళ్లిపోయారు. వచ్చేది మన ప్రభుత్వం మాటిస్తున్నా మీ ఫీజులు ఎంతైనా పూర్తిగా దగ్గరుండి నేనే కటిస్తా.. ఒక్క రూపాయి కూడా కట్టనవరం లేదు. ఇదొక్కటే కాదు.. హాస్టల్స్‌ బోడింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఫీజులు కూడా చెల్లిస్తాం. ఏ స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తుందంటే.. చంద్రబాబు మాదిరిగా నా ఆలోచనలు డబ్బుల మీద ఉండవు.. నేను ముఖ్యమంత్రి కావడానికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే నేను చనిపోయిన తరువాత నాన్న ఫోటోతో పాటుగా నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలనే తపన, తాపత్రయం. దాని కోసం ఆరాటపడుతా.. దాన్ని సాధించేందుకు కృషి చేస్తా. ప్రతిఒక్కరికి నేను తోడుగా ఉంటానని భరోసా కల్పిస్తున్నా. 


Back to Top