హోదా పోరు ఉధృతం- నేడు జాతీయ ర‌హ‌దారుల దిగ్భందం
- ఉద‌యం  గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు రాస్తారోకోలు
- క‌దిలిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
అమ‌రావ‌తి:   ప్ర‌త్యేక హోదా సాధ‌నే ధ్యేయంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచి ఉద్య‌మిస్తునే ఉంది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్న త‌రుణంలో అటు ఢిల్లీలో పార్టీ ఎంపీలు కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. మ‌రోవైపు రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తూ  అంద‌రి ఆకాంక్ష‌ను తెలిపేందుకు   వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్ద‌తుగా 19న అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ప్ర‌జా సంక‌ల్ప మాన‌వ‌హారాలు నిర్వ‌హించారు. ఇవాళ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌మిటీ, వివిధ పార్టీల పిలుపు మేర‌కు జాతీయ ర‌హ‌దారుల దిగ్భందానికి పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని ఇదివ‌ర‌కే పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ శ్రేణుల‌కు పిలుపునివ్వ‌డంతో ర‌హ‌దారుల దిగ్భందానికి క‌దిలారు. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ర‌హ‌దారుల‌ను దిగ్బంధించ‌నున్నారు.

కాగా పార్ల‌మెంట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు రాకుండా స‌భ‌ను వాయిదా వేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు పట్టుదలగా పోరాడుతున్నా సభ సజా వుగా లేదంటూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపె ట్టేందుకు లోక్‌సభాపతి సుమిత్రా మహాజన్‌ అనుమతించలేదు. నిన్న వెల్‌లో ఆందోళన నిర్వహి స్తున్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌లకు మరో పార్టీ జతకలవటంతో సభలో గందరగోళ పరిస్థి తులు నెలకొన్నాయి. ఆర్జేడీ నుంచి గెలిచి జన్‌ అధికార్‌ పేరుతో వేరుకుంపటి పెట్టుకున్న పప్పూయాదవ్‌ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో సభ సజావుగా లేదంటూ వైయ‌స్ఆర్‌ సీపీ  ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నాలుగోసారీ అనుమతిం చలేదు. తీర్మానాన్ని గురువారం నాటి సభాకార్యక్రమాల జాబితాలో చేర్చాలం టూ వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధ‌వారం సెక్రటరీ జనరల్‌ స్నేహలతా శ్రీవాస్తవకు 5వ సారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Back to Top