మార్మోగిన ప్రత్యేక హోదా నినాదం

 

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో ప్రత్యేక హోదా నినాదం మార్మోగింది. శనివారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని యువకులు కలిశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని వారు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ స్పందించారు. ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు తీసుకువస్తానని తిరుపతిలో హామీ ఇచ్చిన చంద్రబాబు తన ఓటుకు కోట్లు కేసు కోసం తాకట్టు పెట్టారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా సాధనకు గల్లీ నుంచి ఢిల్లీదాకా పోరాటం చేసిందని, తిరుపతి వేదికగా యువభేరినిప్రారంభించి యువత, విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించి తీరుతానని, అందుకు యువకులు తనకు మద్దతుగా నిలవాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.
 
Back to Top