ఢిల్లీకి బయలుదేరిన ప్రత్యేక హోదా బస్సు

అనంతపురం: మార్చి 5న ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. ప్రత్యేక హోదా బస్సుకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వైటీఆర్‌ శివారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ..ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు అని, ఇది ఎవరి భిక్ష కాదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌ రాజీ లేని పోరాటాలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 1న కలెక్టరేట్ల ముట్టడిని చేపట్టి మా ఆకాంక్షను తెలిపామన్నారు. అలాగే ఢిల్లీ వీధుల్లో హోదా కోసం పోరుబాట పట్టనున్నట్లు చెప్పారు. అప్పటికి దిగిరాకపోతే ఏప్రిల్‌ 6న మా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని మా నాయకుడు వైయస్‌జగన్‌ ప్రకటించినట్లు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

తాజా ఫోటోలు

Back to Top