ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న స్పీక‌ర్‌

స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు టీడీపీ కార్యకర్తగా పని చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అనిఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారిపై అన‌ర్హ‌త వేటు వేయడం లేద‌న్నారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టడం దారుణమని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.నాటి వైశ్రాయ్‌ రాజకీయాల నుంచి నేటి వరకూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. విభజన చట్టం హామీలను అడగటంలో టీడీపీ ఎంపీలు విఫలయ్యారని, పార్లమెంట్‌ సమావేశాలకు టీడీపీ ఎంపీలు డుమ్మా కొడుతున్నారని, ఇలాంటి ఎంపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని రోజా పిలుపునిచ్చారు.

Back to Top