స్పీకర్ నిర్ణయం సరైనది కాదు

సాంకేతిక కారణాలు సాకుగా చూపి పిటిషన్ ల తిరస్కరణ
స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన వైయస్సార్సీపీ నేతలు
ఫార్మాట్ తప్పుగా ఉంటే నిర్ణయంపై జాప్యం ఎందుకు చేశారని నిలదీత
సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుందని భయపడే ఇదంతా చేశారు
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ  వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులను స్పీకర్ తిరస్కరించడాన్ని పార్టీ నేతలు తప్పుబట్టారు. సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ వాటిని తిరస్కరించడం సరికాదన్నారు.  ఎమ్మెల్యే అనర్హత కేసులపై స్పీకర్ కు పాక్షిక న్యాయాధికారాలు మాత్రమే ఉంటాయని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో విచారణ సందర్భంగా తెలిపిన విషయాన్ని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. 

ఈనెల 8న సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుందని భయపడే ఏవో కారణాలు చెబుతూ హడావిడిగా పిటిషన్ ను తిరస్కరిందారని మండిపడ్డారు.   ఫార్మాట్ తప్పుగా ఉంటే నిర్ణయంపై ఇన్ని రోజులు జాప్యం ఎందుకు చేశారని స్పీకర్ ను నిలదీశారు. స్పీకర్ ఏదైతే  ఫార్మాట్ కావాలంటున్నారో అది కూడా సమర్పిస్తామని బుగ్గన తెలిపారు. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ తగిన చర్యలు తీసుకోవడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ వచ్చే వారం విచారణకు రానున్న దశలో స్పీకర్ ఫిర్యాదును తిరస్కరించడం హేయనీయం. 

తాజా వీడియోలు

Back to Top