గోదావరి బ్రిడ్జిపై ప్రజా సంకల్ప యాత్రకు అనుమతి


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాజమండ్రిపై అడ్డంకులు తొలిగాయి. గోదావరి బ్రిడ్జిపై వైయస్‌ జగన్‌ పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అర్బన్‌ ఎస్పీ రాజకుమారిని కొద్దిసేపటి క్రితం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కలిశారు. నిబంధనలకు లోబడి పాదయాత్ర చేసుకోవాలని ఎస్సీ రాజకుమారి అనుమతిచ్చారు. పాదయాత్రకు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని ఎస్సీ సూచించారు. 
 
Back to Top