బాబు వల్ల ఏపీకి మిగిలేది శోకమే

()స్విస్ ఛాలెంజ్ అంతర్జాతీయ కుంభకోణం
()ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు
()బాబు తప్పుడు పనులను కొన్ని పత్రికలు కప్పేస్తున్నాయి
()మీడియా రాజకీయాలు చేయడం తగదు
()వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం

హైదరాబాద్ః స్విస్ ఛాలెంజ్ విధానం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని విదేశీ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. స్విస్ ఛాలెంజ్ అంతర్జాతీయ కుంభకోణమని నిప్పులు చెరిగారు. కోర్టులు, కేంద్రం నియమించిన కేల్కర్ కమిటీ స్విస్ ఛాలెంజ్ లో పారదర్శకత లేదని చెప్పినా వినకుండా చంద్రబాబు దాన్ని కొనసాగించాలనుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు చేస్తున్నతప్పడు పనులను సమర్థించుకునేందుకు... అడ్వకేట్ జనరల్ ను కూడా వాడుకోవడం దుర్మార్గమని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మ మాట్లాడారు. 

మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే...
()స్విస్ ఛాలెంజ్ విధానమే తప్పుడు విధానం. రెండున్నరేళ్లుగా ఏపీ, సింగపూర్ కు మధ్య  ఒప్పందాలు, వాటాలు ఏవీ బయటకు రానీయకుండా బాబు దాచిపెట్టారు. 
()సింగపూర్ తో సీక్రెట్ ఒప్పందం గురించి హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... వివరణకు వాయిదా కోరి నాటకీయంగా, దొంగచాటుగా నోటిపికేషన్ రిలీజ్ చేశారు. 
()ఎవరైనా బిడ్ వేయాలంటే 13 లోపల వేయాలని టైమ్ మాత్రమే ఇచ్చారు. కానీ, క్వాలిఫికేషన్, కండీషన్స్, వివరాలు మార్చలేదు. 
()స్విస్ ఛాలెంజ్ విధానంలా లేదు... అది ఫ్యాక్షనిస్టు ఛాలెంజ్ లా ఉంది. నీకింత, నాకింత అన్నట్లుగా బాబు, సింగపూర్ కంపెనీలు పంచుకున్నాయి.  
()బాబు సింగపూర్ తో టై అప్ అయి ఇంకొకరు రాజధాని కట్టేందుకు రాకుండా చేశారు. మూడవవాళ్లు ఎవరూ జోక్యం కాకుండా చేశారు. దీన్ని వాదించడానికి అటార్నిజనరల్ ను పిలవడం దారుణం. 
()మీరు చేసిన తప్పులను సమర్థించుకోవడానికి అన్ని వ్యవస్థలను వాడుకోవడం ధర్మమేనా బాబు..?. బాబు, సింగపూర్ కంపెనీలు రాజధానిని పంచుకున్నదానికి ఏజీని వాడుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు
()బీజేపీ, అడ్వకేట్ జనరల్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నిర్ణయాన్ని పరిశీలించుకోండి. అసలు మోడల్ అనేదే లేని స్విస్ ఛాలెంజ్ లో రూల్స్ ఏవీ లేవని కోర్టు తప్పుబడుతుంటే ...బాబు అడ్వకేట్ జనరల్ ను ఉపయోగించుకోవాలనుకోవడం హేయనీయం.   
()ఏజీని అవమానిస్తున్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో న్యాయానికి పోకపోగా అక్రమమైన ఛాలెంజ్ ను సమర్థించుకునేందుకు కోర్టును కూడా పక్కదారి పట్టిస్తున్నారు. దొంగచాటుగా నోటిఫికేషన్ ఇవ్వడం. దానిలో మార్పులు లేకపోవడం పాలన అంటారా బాబు..?
() దోపిడీని కాపాడుకోవడానికి బాబు కేంద్రాన్ని,  ఏజీని అందరినీ వాడుకుంటున్నాడు
()చంద్రబాబును కాపాడడానికి కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. బాబు మాదిరి రాజకీయాలు చేయడం పత్రికలకు తగదు.  బాబు చేస్తున్న తప్పుడు పనులను బయటకు రాకుండా కప్పేయడం మంచి పద్ధతి కాదు.
()ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ సంచలనాత్మక నిర్ణయం ఇచ్చింది. బాబును ముద్దాయిగా చేర్చే విషయమై దర్యాప్తు చేయాలని తీర్పు వస్తే కొన్ని పత్రికల్లో వార్తలు వేయకపోవడం బాధాకరం. 
() నేషనల్ పత్రికలు కూడా బ్యానర్ స్టోరీగా ఇచ్చాయి. ఈనాడులో మెయిన్ పైన ఇవ్వలేదు. ఇంకొక పత్రిక  కొద్దిగా వేసి లోపల సర్దుకుంది.
()బాబు దొరికిన దొంగ అని తేలినా కూడా ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తూ... కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలను కప్పేస్తున్నాయి. 
()ముఖ్యమంత్రిని అవినీతి నిరోధక శాఖ మందలించినంత పనిచేస్తే దాన్ని దాచేసే ప్రయత్నం చేసిన  మీడియాకు మాట్లాడే హక్కు ఎక్కడుంది.
()స్విస్ ఛాలెంజ్ విధానంలో కూడా అలాగే చేశారు. బాబు ఏం చేసినా సమర్థించడం నైతికత అనిపించుకోదు. 
()బాబు తప్పుడు పనికూడా దొరతనం అవుతుందా. ఓటుకు కోట్లు కేసులో బాబు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆయన తప్పు లేదన్నట్లు కప్పిపుచ్చడం మంచి పద్ధతి కాదు
()స్విస్ ఛాలెంజ్ అంతర్జాతీయ కుంభకోణం. సింగపూర్ కంపెనీలకు 40 వేల ఎకరాలను రూ.కోట్ల రూపాయలకు ప్లాట్లు చేసి అమ్ముకునే పరిస్థితి వస్తుంది . 
()సింగపూర్ కంపెనీ పోయాక మళ్లీ చంద్రబాబు, లోకేష్ బినామీ కంపెనీలు వస్తాయి. ఎకరం కోట్ల రూపాయలకు అమ్ముకొని పోతారు. రైతులకు మిగిలేది బూడిద ఏపీకి మిగిలేది శోకమే. 
()మేకిన్ ఇండియాను...మేకిన్ సింగపూర్ , మేకిన్ జపాన్ చేస్తున్నప్పుడు భారతీయ కంపెనీలకు ఎక్కడ అవకాశం ఉంటుందని బాబు తీరుపై పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top