కాసేప‌ట్లో బ్రాహ్మ‌ణుల ఆత్మీయ స‌మ్మేళ‌నంవిశాఖ‌: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా విశాఖ న‌గ‌రంలోని సిరిపురం జంక్ష‌న్‌లో ఏర్పాటు చేసిన బ్రాహ్మ‌ణుల  ఆత్మీయ సమావేశం మ‌రి కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ స‌మ్మేళ‌నానికి జిల్లాకు చెందిన బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. జ‌న‌నేత‌కు  ఆపూర్వ స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్ప‌టికే స‌భా ప్రాంగ‌ణం వైయ‌స్ జ‌గ‌న్ నినాదాల‌తో హోరెత్తుతోంది. ప్ర‌త్యేక బృందాల‌తో  వైయ‌స్ జ‌గ‌న్‌పై ప్ర‌త్యేక గీతాలు ఆల‌పిస్తున్నారు. జ‌న‌నేత ఈ స‌మావేశంలో పాల్గొని బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకోనున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక ఏం చేస్తామ‌న్న‌ది పేర్కొంటారు.
Back to Top