సోమిరెడ్డి విదేశీ ఆస్తులపై ఈడీతో దర్యాప్తు జరిపించాలి

ముత్తుకూరు (సర్వేపల్లి): టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విదేశీ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)తో దర్యాప్తు జరిపించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడుతూ... అధికారంలో ఉన్నాం కదా  అని తనపై అక్రమంగా పోలీసు కేసులు పెట్టించారని  ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.  ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉన్నందున ఈ అంశంపై ఎక్కువ మాట్లాడకూడదని పేర్కొన్నారు.

Back to Top