సోమిరెడ్డి దోషి..ఆయనకు శిక్షపడాల్సిందే

  • అంతర్జాతీయ స్థాయిలో సోమిరెడ్డి అవినీతి, అక్రమాలు
  • చంద్రమోహన్ రెడ్డిని ఇక భగవంతుడు కూడా కాపాడలేడు
  • చంద్రమోహన్ రెడ్డి పనైపోయింది..ఆయన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు
  • దొంగే పోలీస్ స్టేషన్ కు పోయి దొంగతనం చేయలేదని చెబుతున్నాడు
  • వేలకోట్లు నొక్కేసి తనపై దొంగ కేసులు పెట్టే స్థాయికి దిగజారాడు
  • పోలీసులు సోమిరెడ్డిని ప్రశ్నించాలి..పాస్ పోర్టులు సీజ్ చేయాలి
  • చంద్రమోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై ప్రధానికి లేఖ రాస్తాం
  • న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా పోరాటం చేస్తాం..సోమిరెడ్డిని వదిలేది లేదు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి

నెల్లూరుః అంతర్జాతీయ స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన  టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాన్నుంచి బయటపడేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని  వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. సోమిరెడ్డి దోషి అని ఆయనకు శిక్ష పడాల్సిందేనని కాకాని అన్నారు. దొంగతనం చేసి హవాలా డబ్బులు పంపించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై కేసులు పెట్టడమేంటని కాకాని అన్నారు. సోమిరెడ్డికి దమ్మూ ధైర్యం ఉంటే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని కాకాని సవాల్ విసిరారు. దొంగే పోలీస్ స్టేషన్ కు పోయి దొంగతనం చేయలేదని చెప్పడం హాస్యాస్పదమని సోమిరెడ్డిపై కాకాని ధ్వజమెత్తారు. చంద్రమోహన్ రెడ్డి అవినీతి కార్యకలాపాల మీద ఆధారాలన్నీ మీడియా ముందుంచానని, దేనికీ సమాధానం చెప్పుకోలేక తనపై నిందారోపణలు చేస్తున్నారని కాకాని ఫైర్ అయ్యారు. సోమిరెడ్డిని చూసి జనం నవ్వుకుంటున్నారని కాకాని పేర్కొన్నారు. ఇంకేం బయటకు వస్తాయోనని సోమిరెడ్డి తప్పించుకోవాలని చూస్తున్నాడని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా పోరాటం చేస్తాం తప్ప చంద్రమోహన్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదన్నారు. తనపై వచ్చిన ప్రతీ ఆరోపణకి సమాధానం చెబుతానని, పొరపాటంటూ చేస్తే శ్వాస విడుస్తానని చెప్పానని అందుకు  కట్టుబడి ఉంటానని నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో కాకాని పేర్కొన్నారు. 

ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పడానికి, ధృవీకరించడానికి సోమిరెడ్డి ఎవరని, అవి దర్యాప్తు సంస్థలు చేయాల్సిన పని అని కాకాని అన్నారు.  సోమిరెడ్డి ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయమని చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రమోహన్ రెడ్డి పనైపోయిందని,జిల్లా రాజకీయాలనుంచి సోమిరెడ్డిని ప్రజలు తరిమికొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చేసిన అవినీతి నుంచి బయటపడేందుకు సోమిరెడ్డి తన అక్రమాలను నెల్లూరు రూరల్ పీఎస్ లో తొక్కిపెట్టాలని చూస్తున్నాడని కాకాని ధ్వజమెత్తారు. తనపై దొంగ కేసులు పెట్టించి  జైలుకు పంపించాలని సోమిరెడ్డి తెగ తాపత్రయపడుతున్నారని, సోమిరెడ్డి లాంటి అవినీతిపరుడు  కేసులకు, జైళ్లకు భయపడతాడు తప్ప నాలాంటి నీతి, నిజాయితీపరుడు దేనికీ భయపడడని కాకాని అన్నారు. 

అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుట్రలను సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు బయటపెడతాయని కాకాని అన్నారు. కానీ సోమిరెడ్డి వీటిని విడిచిపెట్టి మంది మార్బలంతో వెళ్లి రూరల్ పీఎస్ లో కేసు పెట్టడం, డీజీపీని కలిసి వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. అందరినీ తీసుకెళ్లి బలప్రదర్శన చేయడం దేనికి సోమిరెడ్డి. నీవు అవినీతికి పాల్పడ్డావా లేదా...? నీ ఆస్తుల వివరాలు చెప్పు..? నీవు, నీ తమ్ముడు విడిపోయినప్పుడు పార్టీషియన్ డీడ్ రాసుకున్నారా లేదా..? నీవు బయటపెడతావా, నన్ను బయటపెట్టమంటావా...? ప్రజల ముందు నీ ఆస్తుల వివరాలు బయటపెట్టే ధైర్యం నీకుందా...? నీ పేరుతో ఓ కంపెనీ, మీ శ్రీమతి పేరుతో మూడు కంపెనీలు, మీ కొడుకుకు 9 కంపెనీలున్నాయి.  10, 15 కంపెనీలు పెట్టిన నీవు  ఆ లెక్కలన్నీ ప్రజల ముందుంచితే బాగుంటుంది. విజయవాడలో సొంత స్థలంలో ఇళ్లు కట్టుకున్నావ్...? ఇళ్లు లేదని చెప్పగలవా..? అని సోమిరెడ్డికి సూటిగా ప్రశ్నలు సంధించారు. 

పూర్తిస్థాయిలో విచారణకు సహకరించకుండా గోవర్థన్ రెడ్డిని అది చేశా, ఇది చేశానంటూ మేకపోతు గాంబీర్యం ప్రదర్శించడం విడ్డూరమన్నారు.  ఏం చేయగలవ్ చంద్రమోహన్ రెడ్డి...? నీతాత, ముత్తాత కాదు కదా భగవంతుడు దిగివచ్చినా నిన్ను కాపాడలేడని సోమిరెడ్డిని కాకాని హెచ్చరించారు. చంద్రమోహన్ రెడ్డి కథ అయిపోయిందని, మొత్తం వివరాలతో సహా బయటకొచ్చాడని, దోషి అని నిర్దారణ అవుతోందని తెలిపారు. ముందుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు చంద్రమోహన్ రెడ్డిని  ప్రశ్నించాలని కాకాని డిమాండ్ చేశారు. ఇప్పటికే వారం రోజులుగా కాగితాలు దొరక్కుండా సోమిరెడ్డి జాగ్రత్తపడ్డాడని, ఆయన కుటుంబసభ్యుల పాస్ పోర్టులు సీజ్ చేయకపోతే బయటిదేశాల్లోని లావాదేవీల రికార్డులు కూడా తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. 

506 కేసు పెట్టడం కోసం గోవర్థన్ రెడ్డి బెదిరిస్తున్నాడంటూ సోమిరెడ్డి లేనిపోనివి సృష్టిస్తున్నారని, తాను బెదిరించడం లేదని సోమిరెడ్డే బెదిరిపోతున్నాడని కాకాని ఎద్దేవా చేశారు. తనను  లొంగదీసుకోవడం, బెదిరించడం సోమిరెడ్డి తరం కాదన్నారు.  వేలకోట్లు నొక్కేసి తనపై కేసులు పెట్టే స్థాయికి దిగజారాడని సోమిరెడ్డిని దుయ్యబట్టారు. సోమిరెడ్డి అవినీతి గురించి గతంలోనే చాలాసార్లు రుజువు చేశానని కాకాని చెప్పారు. సోమిరెడ్డి అవినీతికి రోల్ మోడల్ గా నిలుస్తాడని ఎద్దేవా చేశారు. అనేక కోణాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఈ కేసుపై సోమిరెడ్డి విచారణకు సిద్దంగా ఉండాలన్నారు.  సోమిరెడ్డిని వదిలేది లేదని, శిక్ష అనుభవించి తీరాల్సిందేనని కాకాని కుండబద్ధలు కొట్టారు. చంద్రమోహన్ రెడ్డి అక్రమాలపై ఆధారాలతో సహా ప్రధానికి కూడా లేఖ రాస్తానని గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి అవినీతిపరులు రాజకీయాల్లో కొంతమందిని కలుపుకొని అవినీతికి పాల్పడడాన్ని తెలియజేస్తానన్నారు.


Back to Top