సోమిరెడ్డి అవినీతిని నిరూపిస్తాం

–ఎమ్మెల్యే కాకాణిని సోమిరెడ్డి అనుచరులు విమర్శిస్తే ఊరుకోం
–వైయస్‌ఆర్‌సీపి ఎస్సీసెల్‌ జిల్లా నాయకులు అడపాల

వెంకటాచలం: ఎన్నికల్లో ప్రజల చేతుల్లో ఓటమి పాలై దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతిని నిరూపిస్తామని వైయస్‌ఆర్‌సీపి ఎస్సీసెల్‌ జిల్లా నాయకులు అడపాల ఏడుకొండలు పేర్కొన్నారు. వెంకటాచలంలోని ఎంపీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఉదయం మాట్లాడారు. అభివృద్ది, అవినీతిపై మంత్రి సోమిరెడ్డి విసిరిన సవాల్‌ను ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి స్వీకరించి ఈనెల11తేదీన వెంకటాచలంకు రావడం జరిగిందన్నారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన మంత్రి సోమిరెడ్డి తోకముడిచి చర్చకు రాకుండా జిల్లా నుంచి పరారైన విషయం వాస్తవంకాదానని ప్రశ్నించారు. నకిలీ ఎరువులు, క్రికెట్‌ కిట్లు, పనికి ఆహారపథకం బియ్యం పథకంలో సోమిరెడ్డి అవినీతి ఎంటో జిల్లా ప్రజలందరికీ తెలియని విషయం కాదన్నారు. తాజాగా చంద్రన్న రైతు రథం పేరుతో రైతులుకు ట్రాక్టర్లు పంపిణీలో సోమిరెడ్డి తన వాటా కోసం అర్రులు చాస్తున్న విషయాన్ని టిడిపి నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇడిమేపల్లి ఎంపీటీసీగా ఉన్న చాట్ల వెంకటసుబ్బయ్యకు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలే తప్ప అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈసమావేశంలో ఎంపీపీ తలపల అరుణ, మండల ఉపాధ్యక్షులు శ్రీధర్‌నాయుడు, మండల కోఆప్షన్‌ సభ్యులు హుస్సేన్, ఎస్సీసెల్‌ జిల్లా నాయకులు పైనం నరసయ్య, మందా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Back to Top