సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

రాయచోటి రూరల్‌: తమ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని పట్టణ సమీపంలోని చెన్నముక్కపల్లె గఫూర్‌ మసీదు వీధి వాసులు శనివారం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ఆ ప్రాంతవాసులు ఎమ్మెల్యేని కలిసి రహదారి, మురికికాలువలు , నీటి పైపులైన్లు ఏర్పాటు చేయించాలని కోరడంతో స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఉపవాస దీక్షలతో గఫూర్‌ మసీదులో ఆయన మధ్యాహ్నం పలువురు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదులో పని చేస్తున్న ఇమామ్, మౌజన్‌లకు వేతనాలు అందడం లేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఎమ్మెల్యే వారితో అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గఫార్‌సాబ్, ముల్లా హజరత్, మియాజాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top